Telugu Global
International

74శాతం మంది భారతీయుల్లో ఒత్తిడి !

కోవిడ్ 19 వైరస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చింది. కొందరి జీవితాల్లో పెనుమార్పులే వచ్చాయి. మార్పులకు అలవాటు పడటం, వాటిని తట్టుకోవటం చాలా మందిలో శక్తికి మించిన పనిగా ఉంటోంది. అలాంటివారిలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. ఢిల్లీనుండి పనిచేస్తున్న ది సెంటర్ ఆఫ్ హీలింగ్… సంస్థ…పదివేలమందిని ప్రశ్నించి ఓ సర్వే నిర్వహించగా 74శాతం మంది భారతీయులు ఒత్తిడితో, 88శాతం మంది యాంగ్జయిటీతో బాధపడుతున్నట్టుగా తేలింది. ది సెంటర్ ఆఫ్ హీలింగ్… అనారోగ్యాలను నివారించడంలో […]

74శాతం మంది భారతీయుల్లో ఒత్తిడి !
X

కోవిడ్ 19 వైరస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చింది. కొందరి జీవితాల్లో పెనుమార్పులే వచ్చాయి. మార్పులకు అలవాటు పడటం, వాటిని తట్టుకోవటం చాలా మందిలో శక్తికి మించిన పనిగా ఉంటోంది. అలాంటివారిలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. ఢిల్లీనుండి పనిచేస్తున్న ది సెంటర్ ఆఫ్ హీలింగ్… సంస్థ…పదివేలమందిని ప్రశ్నించి ఓ సర్వే నిర్వహించగా 74శాతం మంది భారతీయులు ఒత్తిడితో, 88శాతం మంది యాంగ్జయిటీతో బాధపడుతున్నట్టుగా తేలింది. ది సెంటర్ ఆఫ్ హీలింగ్… అనారోగ్యాలను నివారించడంలో పనిచేస్తున్న ఒక హెల్త్ కేర్ సంస్థ.

తమ వద్దకు మానసిక సమస్యలతో వస్తున్నవారి సంఖ్య, తాము థెరపీ కోసం వెచ్చిస్తున్న సమయం పెరిగాయని 68.6శాతం మంది థెరపిస్టులు అధ్యయనంలో వెల్లడించారు. కోవిడ్ 19 వచ్చిన తరువాత మొదటిసారి థెరపీలు తీసుకుంటున్నవారి సంఖ్య పెరిగిందని 55 శాతం మంది మానసిక నిపుణులు వెల్లడించారు.

లాక్ డౌన్… ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యంపై ఎంతోకొంత నెగెటివ్ ప్రభావం చూపించిందని, అయితే కరోనా కారణంగా ఒత్తిడి, యాంగ్జయిటీలు పెరిగాయా లేదా మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకోకపోవటం వలన సమస్యలు మరింతగా పెరిగాయా అనేది తేలాల్సి ఉందని ది సెంటర్ ఆఫ్ హీలింగ్ వ్యవస్థాపకుడు గురుప్రీత్ సింగ్ అన్నారు.

కోవిడ్ 19 వచ్చినప్పటినుండీ… లాక్ డౌన్ ప్రకటించినప్పటినుండీ మానసిక నిపుణులు…మానసిక సమస్యలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అధ్యయనంలో ప్రశ్నించిన వారిలో 57శాతం మంది తాము కొంత ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. అలాగే 11 శాతం మందిలో ఒకమాదిరి ఒత్తిడి, 4శాతం మందిలో అంతకంటే ఎక్కువస్థాయిలో, 2 శాతం మందిలో చాలా తీవ్రమైన స్థాయిలో ఒత్తిడి లక్షణాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది.

First Published:  12 Dec 2020 8:35 PM GMT
Next Story