Telugu Global
International

ఏడు కోట్లకు చేరువలో కరోనా మీటర్‌‌ ... కోటి కేసులకు దగ్గరగా ఇండియా

లాక్‌డౌన్ ఎత్తేశారు. అలాగే, రోజూ వ్యాక్సిన్ అప్‌డేట్స్ వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా కరోనా కేసుల తాలూకు డేటాను మునపటిలా విడుదల చేయడం లేదు. దీంతో కరోనా కేసుల గురించి చాలామంది మర్చిపోయారనే చెప్పాలి. కానీ, జాన్స్ హప్‌కిన్స్‌ యూనివర్సిటీ ట్రాకర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. కరోనా కేసులూ, చనిపోయిన పేషెంట్ల లెక్క ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉంది. ఏ దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత మంది చనిపోయారు? అని ప్రపంచానికి కరోనా […]

ఏడు కోట్లకు చేరువలో కరోనా మీటర్‌‌ ... కోటి కేసులకు దగ్గరగా ఇండియా
X

లాక్‌డౌన్ ఎత్తేశారు. అలాగే, రోజూ వ్యాక్సిన్ అప్‌డేట్స్ వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా కరోనా కేసుల తాలూకు డేటాను మునపటిలా విడుదల చేయడం లేదు. దీంతో కరోనా కేసుల గురించి చాలామంది మర్చిపోయారనే చెప్పాలి. కానీ, జాన్స్ హప్‌కిన్స్‌ యూనివర్సిటీ ట్రాకర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. కరోనా కేసులూ, చనిపోయిన పేషెంట్ల లెక్క ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉంది. ఏ దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత మంది చనిపోయారు? అని ప్రపంచానికి కరోనా లెక్కలు చెప్పేది ఈ ట్రాకరే!

దీని ప్రకారం.. శుక్రవారం వరకు ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల తొంభై లక్షల మందికి కరోనా సోకింది. ఇందులో అత్యధికంగా అంటే కోటి యాభై లక్షల కరోనా కేసులతో అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 98 లక్షల కేసులతో భారత్ రెండో ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత 67 లక్షల కేసులతో బ్రెజిల్‌ మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు దేశాల్లోనే కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.

అయితే, ఈ దేశాల జనాభా కూడా ఎక్కువే కాబట్టి, వేరే దేశాలతో పోల్చడం కడా సరికాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 15.8 లక్షలమంది కరోనాతో ప్రాణాలు పొగొట్టుకుంటే, అందులో 1.4 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు.

First Published:  11 Dec 2020 10:12 PM GMT
Next Story