Telugu Global
International

‘ఆ విమానాల్లో బాత్ రూంకి వెళ్లకండి... డైపర్లు వేసుకోండి ’

విమానాల్లో పనిచేసే క్యాబిన్ సిబ్బంది బాత్ రూంకి  వెళ్లవద్దని… అందుకు బదులుగా డైపర్లను వాడమని… చైనా పౌర విమానయాన సంస్థ… తమ సిబ్బందికి సూచించింది. కోవిడ్ 19 రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూకి ఈ సూచనలు చేసింది సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సిఎఎసి). డిస్పోజబుల్ డైపర్లను వాడుతూ బాత్ రూం కి వెళ్లటం నివారిస్తే… కోవిడ్ రిస్క్ ని తగ్గించుకోవచ్చని సిఎఎసి తెలిపింది. ఎయిర్ లైన్స్ […]

‘ఆ విమానాల్లో బాత్ రూంకి వెళ్లకండి... డైపర్లు వేసుకోండి ’
X

విమానాల్లో పనిచేసే క్యాబిన్ సిబ్బంది బాత్ రూంకి వెళ్లవద్దని… అందుకు బదులుగా డైపర్లను వాడమని… చైనా పౌర విమానయాన సంస్థ… తమ సిబ్బందికి సూచించింది.

కోవిడ్ 19 రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూకి ఈ సూచనలు చేసింది సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సిఎఎసి). డిస్పోజబుల్ డైపర్లను వాడుతూ బాత్ రూం కి వెళ్లటం నివారిస్తే… కోవిడ్ రిస్క్ ని తగ్గించుకోవచ్చని సిఎఎసి తెలిపింది.

ఎయిర్ లైన్స్ లో, ఎయిర్ పోర్టుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే ఈ మార్గదర్శకాలను 38, 11 పేజీలతో కూడిన సుదీర్ఘమైన డాక్యుమెంట్లలో సిఎఎసి వివరించింది. సిఎఎసి తమ వెబ్ సైట్ లో ఈ వివరాలను ఉంచింది.

ఈ సూచనలన్నీ… పదిలక్షల మంది జనాభాకు 500 కేసులకు మించి ఉన్న ప్రాంతాలకు రాకపోకలు సాగించే విమానాలకు వర్తిస్తాయని సిఎఎసి తెలిపింది. స్వీయ రక్షణకు వాడే పరికరాల్లో… డైపర్లను సైతం చేర్చింది. కోవిడ్ ఇన్ ఫెక్షన్ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి క్యాబిన్ సిబ్బంది డిస్పోజబుల్ డైపర్లను వాడాలని, మరీ ప్రత్యేక పరిస్థితులేమైనా ఉంటే తప్ప లావెటరీకి వెళ్లవద్దని సిఎఎసి తన మార్గదర్శకాల్లో చాలా స్పష్టంగా పేర్కొంది.

ఈ సిబ్బందికి మానసిక స్థయిర్యాన్నిచ్చే కౌన్సిలింగ్ ఇవ్వాలని, వీరి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వీరి కుటుంబాలనుండి వచ్చే ఒత్తిళ్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఆ మార్గదర్శకాల్లో ఉంది.

విమానాల్లో క్యాబిన్ ప్రాంతాన్ని డిస్పోజబుల్ కర్టెన్లని ఉపయోగించి నాలుగు భాగాలుగా… క్లీన్ ఏరియా, బఫర్ జోన్, ప్యాసింజర్ సిట్టింగ్ ఏరియా, క్వారంటైన్ ఏరియాలుగా విభజించాలని తెలిపింది. చివరల్లో ఉన్న మూడు వరుసలను ఎమర్జన్సీ క్వారంటైన్ ఏరియాగా ఏర్పాటు చేయాలని సిఎఎసి పేర్కొంది.

చైనాలో ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయి విమానాలు చాలావరకు నడవటం లేదు. డొమెస్టిక్ విమాన ప్రయాణాల మార్కెట్ మాత్రం చాలా వేగంగా పుంజుకుంటోంది.

First Published:  10 Dec 2020 10:41 AM GMT
Next Story