Telugu Global
International

ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను ఫేస్‌బుక్ విక్రయించాల్సిందేనా?

ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్ ఫేస్‌బుక్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్దంగా ఆ సంస్థ చిన్న కంపెనీలను అణిచివేస్తోందంటూ అమెరికా ఫెడరల్ ప్రభుత్వంతో పాటు 48 రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో దావాలు వేశాయి. ఫేస్‌బుక్ తనకు ఉన్న డబ్బు, పరపతితో తనకు పోటీగా ఉన్న చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నదని.. తద్వారా పోటీ మార్కెట్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదని ఆ దావాలో పేర్కొన్నాయి. ఈ దావాల కారణంగా ఫేస్‌బుక్ తన సబ్సిడరీలు అయిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించ […]

ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లను ఫేస్‌బుక్ విక్రయించాల్సిందేనా?
X

ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా నెట్‌వర్క్ ఫేస్‌బుక్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్దంగా ఆ సంస్థ చిన్న కంపెనీలను అణిచివేస్తోందంటూ అమెరికా ఫెడరల్ ప్రభుత్వంతో పాటు 48 రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో దావాలు వేశాయి. ఫేస్‌బుక్ తనకు ఉన్న డబ్బు, పరపతితో తనకు పోటీగా ఉన్న చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నదని.. తద్వారా పోటీ మార్కెట్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదని ఆ దావాలో పేర్కొన్నాయి.

ఈ దావాల కారణంగా ఫేస్‌బుక్ తన సబ్సిడరీలు అయిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించ తప్పని పరిస్థితి ఎదురైంది. ఫేస్‌బుక్ గతంలో తనకు పోటీగా ఉన్నాయని భావించి వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లను కొనుగోలు చేసింది. ఇది ఫెడరల్ నిబంధనలకు విరుద్దంగా జరిగిందని పలు కంపెనీలు అప్పట్లోనే ఆరోపించాయి.

సోషల్ మీడియా వేదికలను మొత్తం ఫేస్‌బుక్ తన గుత్తాధిపత్యంలోనికి తీసుకొస్తున్నదని.. దీని వల్ల వినియోగదారులు ఇతర కంపెనీల ఉత్పత్తులను ఎంచుకునే అవకాశాలు పోతున్నాయని దావాల్లో ఆరోపించారు. ఫేస్‌బుక్ ఇలాంటి విధానాలను అవలంభించకుండా ఆంక్షలు విధించాలని.. సోషల్ నెట్‌వర్కింగ్‌లో పోటీని తీసుకొని రావాలని న్యాయస్థానాలను కోరాయి.

ఈ దావా కారణంగా స్టాక్ మార్కెట్లో ఫేస్‌బుక్ షేర్లు భారీగా పతనమయ్యాయి. న్యాయస్థానం కనుక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఫేస్‌బుక్ తమ సబ్సిడరీలైన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించాల్సిన పరిస్థితి వస్తుంది.

First Published:  10 Dec 2020 2:09 AM GMT
Next Story