Telugu Global
International

ధనిక దేశాలే వ్యాక్సిన్ మొత్తం కొనేస్తున్నాయి !

ఒక పక్క కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చేసిందని… ఇక భయం లేదని ప్రభుత్వాలు చెబుతుండగా మరో పక్క వ్యాక్సిన్ ల పంపకం గురించిన చేదు నిజాలు బయటకు వస్తున్నాయి. పేద దేశాల్లో  ప్రతి పదిమందిలో తొమ్మిది మందికి వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందే అవకాశం లేదని ఒక నూతన నివేదిక వెల్లడిస్తోంది. పేరున్న కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ మొత్తాన్ని ధనిక దేశాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. అంటే దాదాపు తొంభైశాతం […]

ధనిక దేశాలే వ్యాక్సిన్ మొత్తం కొనేస్తున్నాయి !
X

ఒక పక్క కోవిడ్ కి వ్యాక్సిన్ వచ్చేసిందని… ఇక భయం లేదని ప్రభుత్వాలు చెబుతుండగా మరో పక్క వ్యాక్సిన్ ల పంపకం గురించిన చేదు నిజాలు బయటకు వస్తున్నాయి. పేద దేశాల్లో ప్రతి పదిమందిలో తొమ్మిది మందికి వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందే అవకాశం లేదని ఒక నూతన నివేదిక వెల్లడిస్తోంది. పేరున్న కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ మొత్తాన్ని ధనిక దేశాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. అంటే దాదాపు తొంభైశాతం జనాభా… తమకు కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా… అని ఎదురు చూడాల్సిన పరిస్థితి అన్నమాట.

ఆక్స్ ఫార్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనినా కంపెనీ… తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్లో 64 శాతం మోతాదులను అభివృద్ది చెందుతున్న దేశాలకు ఇవ్వాలని భావించినప్పటికీ అది సాధ్యమయ్యేలా లేదు. తక్కువ ఆదాయం ఉన్న 70 దేశాలు తమ ప్రజల్లో ప్రతి పది మందిలో ఒకరికి మాత్రమే వ్యాక్సిన్ ని అందించగలవని… పెద్ద దేశాలు తమ ప్రజల సంఖ్యకు మూడు రెట్లు ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వచేయడమే ఇందుకు కారణమని పీపుల్స్ వ్యాక్సిన్ కూటమి పేర్కొంది. ఈ లెక్కన ప్రపంచ జనాభాలో 14శాతం జనాభా ఉన్న పెద్ద దేశాల వద్ద 53 శాతం వ్యాక్సిన్ ఉంది.

ధనిక దేశాలు చేసుకున్న ఒప్పందాలతో పేదలను వైరస్ దయకు వదిలివేయటం జరుగుతోందని పీపుల్స్ వ్యాక్సిన్ కూటమి తెలిపింది. సామర్ధ్యాన్ని పరీక్షించిన మూడు వ్యాక్సిన్లలో రెండు … మొడెర్నా, ఫైజర్ బయో టెక్. ఈ రెండు కంపెనీల తాలూకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ మొత్తాన్ని ధనికదేశాలు కొనుగోలు చేశాయని పీపుల్స్ వ్యాక్సిన్ కూటమి పేర్కొంది.

యుకెలో వ్యాక్సిన్ పంపిణీ మొదలు కాగా… కెనడా అన్ని దేశాలకంటే ఎక్కువగా తమ పౌరులకు ఐదుసార్లు వ్యాక్సిన్ వేసినా సరిపోయేంత మోతాదుల్లో దానిని కొనుగోలు చేసింది. నాటకీయంగా ఏదన్నా జరిగితే తప్ప వందల కోట్లమంది ప్రజలు సంవత్సరాల తరబడి వ్యాక్సిన్ కోసం వేచి చూడాల్సి వస్తుందని.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అంటున్నాయి.

కోవిడ్ తో మనుషుల మనస్తత్వాల్లో మార్పులు వచ్చాయని చాలా సందర్భాల్లో చెపుకుంటున్నాం కానీ… ఏమీ మారలేదని దాని వ్యాక్సిన్ విషయంలోనే రుజువైంది.

First Published:  9 Dec 2020 8:57 AM GMT
Next Story