Telugu Global
CRIME

భార్య మాట విని ఉంటే… బతికి ఉండేవాడు !

పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో తీవ్రంగా గాయపడి… ఉలెన్ రాయ్ అనే బీజేపీ కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. బీజేపీ యువమోర్చా… మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీని నిర్వహించింది. పోలీసులు లాఠీచార్జి జరపటంతో పాటు నీటిఫిరంగులు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో తీవ్రంగా గాయపడిన ఉలెన్ రాయ్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే తన భర్త తన మాట వినిఉంటే ప్రాణాలతో ఉండేవాడంటూ అతని భార్య రోదిస్తోంది. జల్పాయిగురి జిల్లాలో […]

భార్య మాట విని ఉంటే… బతికి ఉండేవాడు !
X

పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో తీవ్రంగా గాయపడి… ఉలెన్ రాయ్ అనే బీజేపీ కార్యకర్త మరణించిన విషయం తెలిసిందే. బీజేపీ యువమోర్చా… మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ర్యాలీని నిర్వహించింది. పోలీసులు లాఠీచార్జి జరపటంతో పాటు నీటిఫిరంగులు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో తీవ్రంగా గాయపడిన ఉలెన్ రాయ్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే తన భర్త తన మాట వినిఉంటే ప్రాణాలతో ఉండేవాడంటూ అతని భార్య రోదిస్తోంది.

జల్పాయిగురి జిల్లాలో మెయిన్ ఘోరా అనే గ్రామానికి చెందిన ఉలెన్ రాయ్ సోమవారం ఉదయాన్నే ర్యాలీలో పాల్గొనేందుకు ఇంట్లోంచి బయలుదేరాడు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ అది. అయితే భర్త బయలుదేరటం చూసిన రాయ్ భార్య మాలతి… ఈ రోజు పని ఉంది.. బయటకు వెళ్లవద్దని కోరింది. జల్పాయిగురిలో ఉన్న స్కూల్లో తమ కుమార్తెని ఐదో తరగతిలో చేర్పించాలని, ఎక్కడకూ వెళ్లవద్దని చెప్పిందామె. కానీ అతను ఆమె మాట వినలేదు… మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్లాడు. మాలతి, పిల్లలు అతని కోసం ఎదురుచూస్తుండగా ఆ చేదువార్త ఇంటికి వచ్చింది.

ఉలెన్ రాయ్ కి కుమార్తెతో పాటు తొమ్మిది, ఆరు చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. తొంభై ఏళ్ల తండ్రితో పాటు కుటుంబమంతా అతనిపైనే ఆధారపడి ఉంది. ఈ కుటుంబానికి చాలా చిన్నపాటి టీ తోట ఉంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉలెన్ రాయ్ రోజువారీ కూలీగా కూడా పనిచేసేవాడు. వీరి కుటుంబం బైకాంటపూర్ అనే అడవి ప్రాంతంలో ఒక చెక్క ఇంట్లో నివసిస్తున్నారు. తరచుగా ఏనుగులు అక్కడకు వస్తుంటాయి. తమ కుటుంబం… ఉన్న ఒక్క ఆధారం కోల్పోయి దిక్కులేనిదై పోయిందని, తన మాటవిని ర్యాలీకి వెళ్లకుండా ఉంటే తన భర్త బతికి ఉండేవాడని… ఉలెన్ రాయ్ భార్య మాలతి రోదిస్తోంది. నలుగురు బీజేపీ ఎంపీలు ఉలెన్ రాయ్ ఇంటికి వెళ్లి… పిల్లల చదువు బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు.

First Published:  6 Dec 2020 8:56 AM GMT
Next Story