నేషనల్ మీడియాని తప్పుదోవ పట్టించిన తెలుగు మీడియా..
బ్రేకింగ్ న్యూస్ పేరిట జరుగుతున్న అరాచకం తెలుగు మీడియాని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోందనడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల రిపోర్టింగే తాజా ఉదాహరణ. బ్రేకింగ్ హడావిడిలో బ్యాలెట్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ల మధ్య తేడా తెలియకుండా పోయింది జర్నలిస్ట్ లకు. హైదరాబాద్ లోని మొత్తం 150 డివిజన్లలో 1926 పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నాయి. బల్దియా ఓట్లలో ఈ పోస్టల్ బ్యాలెట్ ల సంఖ్య అస్సలు ఏమాత్రం లెక్కలోకి రాదు. అయితే ఇందులో 88 డివిజన్లలో బీజేపీకి […]
బ్రేకింగ్ న్యూస్ పేరిట జరుగుతున్న అరాచకం తెలుగు మీడియాని పూర్తిగా భ్రష్టు పట్టిస్తోందనడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల రిపోర్టింగే తాజా ఉదాహరణ. బ్రేకింగ్ హడావిడిలో బ్యాలెట్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ల మధ్య తేడా తెలియకుండా పోయింది జర్నలిస్ట్ లకు. హైదరాబాద్ లోని మొత్తం 150 డివిజన్లలో 1926 పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నాయి. బల్దియా ఓట్లలో ఈ పోస్టల్ బ్యాలెట్ ల సంఖ్య అస్సలు ఏమాత్రం లెక్కలోకి రాదు. అయితే ఇందులో 88 డివిజన్లలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. పోనీ వచ్చిందే అనుకుందాం.. పోస్టల్ బ్యాలెట్ తోనే విజయం తేలిపోదు కదా? అసలు విషయం తేలాల్సిందే కదా? అయితే అంతసేపు మన తెలుగు మీడియా ఆగలేకపోయింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి దూసుకెళ్తోందని బ్రేకింగ్ స్టార్ట్ చేసింది. ఇంకేముంది ఆ ఛానెల్ చూసి, ఇంకొకరు, వారిని చూసి మరొకరు.. మొత్తం అన్ని ఛానెళ్లలో అదే బ్రేకింగ్. విషయం ఏంటా అని ఆరా తీస్తే పోస్టల్ బ్యాలెట్లలో 88 డివిజన్లలో బీజేపీకి మెజార్టీ వచ్చిందట. అశ్వత్థామ హత: కుంజరహ: టైపులో బీజేపీకి ఆధిక్యం అనేది పెద్దగా చెప్పి, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో అనే విషయాన్ని దాచిపెట్టేశారు. ఇంకేముంది ఈ బ్రేకింగ్ లతో నేషనల్ మీడియా కూడా తప్పుదారి పట్టింది. హైదరాబాద్ పై బీజేపీ జెండా ఎగరబోతోందంటూ అప్ డేట్ ఇచ్చేసింది. బీజేపీ అనుకూల మీడియా మరింత హడావిడి చేసేసింది. 88 డివిజన్లలో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోందని, గ్రేటర్ మేయర్ పీఠం బీజేపీదేనని తేల్చి చెప్పింది. మూడు గంటలు ఈ బ్రేకింగ్ నడిపిన తర్వాత తెలుగు మీడియా నాలుక కరుచుకుంది. అసలు బ్యాలెట్ కౌంటింగ్ మొదలైన తర్వాత విషయం బైటకొచ్చింది. బీజేపీ కేవలం పోస్టల్ బ్యాలెట్ లోనే ముందుందని, అసలు బ్యాలెట్ లో మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్ కే పడ్డాయని తేలింది. దీంతో రిపోర్టర్లు, ఎడిటర్లు అంతా రూటు మార్చారు. అసలు ఫిగర్లు వేసి, కొసరు మెజార్టీ లెక్కల్ని ఆపేశారు. కొసమెరుపు ఏంటంటే.. హైదరాబాద్ నిర్మాతలం అని చెప్పుకుంటున్న టీడీపీకి ఒక్కటంటే ఒక్కటి కూడా పోస్టల్ బ్యాలెట్ రాకపోవడం విశేషం. కౌంటింగ్ లో ఏ ఒక్క ఛానెల్ కూడా టీడీపీని ప్రత్యేకంగా చూపించలేదు, ఇతరుల్లో కలిపేశారు. ఈ కౌంటింగ్ ఎపిసోడ్ లో తెలుగు మీడియా అత్యుత్సాహం, అవగాహన రాహిత్యం పూర్తి స్థాయిలో విమర్శలకు గురవుతోంది.