Telugu Global
Cinema & Entertainment

ఇక వెడ్డింగ్ రిసెప్షన్ లేనట్టే

పెళ్లి తర్వాత పరిశ్రమలవారీగా రిసెప్షన్ ఇస్తానని ప్రకటించింది కాజల్. ఆ తర్వాత ఎంచక్కా హనీమూన్ కు వెళ్లింది. కానీ హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కాజల్ మనసు మారిపోయింది. రిసెప్షన్ ఆలోచనల్ని పూర్తిగా వదిలేసింది. సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోంది. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఒక రిసెప్షన్, చెన్నైలో మరో రిసెప్షన్ ఇవ్వాలని అనుకుంది కాజల్. హైదరాబాద్ లో పూర్తిగా టాలీవుడ్ జనాలకు, చెన్నైలో కోలీవుడ్ జనాలకు పార్టీ ఇవ్వాలనేది ఆమె ఆలోచన. ఇప్పుడు ఆ ప్లాన్స్ […]

ఇక వెడ్డింగ్ రిసెప్షన్ లేనట్టే
X

పెళ్లి తర్వాత పరిశ్రమలవారీగా రిసెప్షన్ ఇస్తానని ప్రకటించింది కాజల్. ఆ తర్వాత ఎంచక్కా హనీమూన్ కు వెళ్లింది. కానీ హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కాజల్ మనసు మారిపోయింది. రిసెప్షన్ ఆలోచనల్ని పూర్తిగా వదిలేసింది. సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటోంది.

పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఒక రిసెప్షన్, చెన్నైలో మరో రిసెప్షన్ ఇవ్వాలని అనుకుంది కాజల్. హైదరాబాద్ లో పూర్తిగా టాలీవుడ్ జనాలకు, చెన్నైలో కోలీవుడ్ జనాలకు పార్టీ ఇవ్వాలనేది ఆమె ఆలోచన. ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ పక్కనపెట్టేసింది.

నిజానికి ఆమె టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇవ్వాలనుకుంది. కానీ ఆ పార్టీ ఇచ్చిన తర్వాత కోలీవుడ్ లో పార్టీ ఇవ్వకపోతే చిక్కు. ఆ రెండు పార్టీలు ఇచ్చిన తర్వాత బాలీవుడ్ లో పార్టీ ఇవ్వాల్సిందే. ఇస్తే 3 పార్టీలు ఇవ్వాలి లేదంటే అన్నీ పక్కనపెట్టేయాలి. కాజల్ రెండో ఆప్షన్ వైపే మొగ్గుచూపుతోంది.

ఆమె సినిమాలు ఇప్పటికే ఆలస్యమౌతున్నాయి. ఆచార్య, ఇండియన్-2 సినిమాలు స్టార్ట్ చేయాలి. మోసగాళ్లు సినిమా వర్క్ కూడా పెండింగ్ ఉంది. ఇలాంటి టైమ్ లో పార్టీల పేరిట మళ్లీ సమయం వృధా చేయదలుచుకోలేదు కాజల్. మరో వారం రోజుల్లో ఆమె ఆచార్య సెట్స్ పైకి వస్తుంది.

First Published:  3 Dec 2020 9:47 PM GMT
Next Story