కరోనా తొలి వ్యాక్సిన్‌కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్... వచ్చే వారమే అందుబాటులోకి...
కరోనా తొలి వ్యాక్సిన్‌కు ముద్ర పడింది. బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైజర్ బయోన్‌టెక్ డెవలప్ చేసిన ఫైజర్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి లభించింది. వచ్చేవారమే ఈ వ్యాక్సిన్ యూకేలో అందుబాటులోకి రాబోతోంది. డిసెంబర్ 7 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. అమెరికా ఫార్మా కంపెనీ పైజర్-జర్మనీకి చెందిన బయోన్‌టెక్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. మొన్నటి వరకూ 95% సక్సెస్ రేటు ఉందని చెప్పిన సంస్థ ఇప్పుడు నూటికి నూరు శాతం […]

కరోనా తొలి వ్యాక్సిన్‌కు ముద్ర పడింది. బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైజర్ బయోన్‌టెక్ డెవలప్ చేసిన ఫైజర్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి లభించింది. వచ్చేవారమే ఈ వ్యాక్సిన్ యూకేలో అందుబాటులోకి రాబోతోంది. డిసెంబర్ 7 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
అమెరికా ఫార్మా కంపెనీ పైజర్-జర్మనీకి చెందిన బయోన్‌టెక్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తోంది. మొన్నటి వరకూ 95% సక్సెస్ రేటు ఉందని చెప్పిన సంస్థ ఇప్పుడు నూటికి నూరు శాతం సేఫ్, ఎఫిషీయన్సీ అని చెబుతూ ఆథరైజేషన్‌కు అప్లై చేసింది. యూకే ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది.
వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్న వాలంటీర్లు, సురక్షిత డేటా, సుస్థిరమైన తయారీ అనేవి మూడు కీలకమైన అంశాలని పైజర్ చెప్పింది. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం ఫైల్ చేయడానికి ఈ మూడు అవసరమని పైజర్ వివరించింది. ఎమర్జెన్సీనే కాదు.. పూర్తిస్థాయి సురక్షితమని చెబుతున్న ఫైజర్ పూర్తిస్థాయి వినియోగానికి అప్లై చేసింది. బ్రిటన్ ప్రభుత్వం కూడా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓకే చెసేసింది. దీంతో ఈనెల 7 నుంచే యూకేలో వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది.
పైజర్ ఇప్పటిదాకా అమెరికాతోపాటు మరో 5 దేశాల్లోని 44వేల మందిపై ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ల ప్రయోగాలు చేసింది. ఇందులో 94 ఇన్ఫెక్షన్లు గుర్తించినట్లు – ఒక ఇండిపెండెంట్ డేటా మానేటరింగ్ బోర్డు చెబుతోంది. మొత్తమ్మీద పైజర్, బయోన్‌టెక్ చేసిన ప్రయోగాలు, వచ్చిన ఫలితాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
అయితే వ్యాక్సిన్ ధర మనదేశ లెక్కల ప్రకారం ఒక్కో డోస్ రేటు 15 వందల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఒక్కో వ్యక్తికి రెండు డోస్‌లు తప్పనిసరి కాబ్టటి.. కొవిడ్ బారి నుంచి తప్పించుకోవాలంటే సగటున ఒక వ్యక్తికి 3వేలు ఖర్చు అవుతుంది.