Telugu Global
Health & Life Style

కరోనా బాధితులు... ఎన్నిరోజులు వైరస్ ని వ్యాప్తి చేస్తారు?

కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. నేటికీ అధ్యయనాల ద్వారా కొత్తవిషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి.  కరోనాపై ఎంత అవగాహన పెంచుకుంటే అంతగా దాని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. స్కాట్ లాండ్ లోని సెయింట్ అండ్రూస్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో కరోనా వ్యాప్తి విషయంలో అత్యంత ముఖ్యమైన కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనని బట్టి  కరోనా సోకిన వ్యక్తిలో… మొదటి సారి లక్షణం కనిపించిన రోజునుండి… ఇన్ […]

కరోనా బాధితులు... ఎన్నిరోజులు వైరస్ ని వ్యాప్తి చేస్తారు?
X

కరోనా వైరస్ విషయంలో ఇప్పటికీ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. నేటికీ అధ్యయనాల ద్వారా కొత్తవిషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. కరోనాపై ఎంత అవగాహన పెంచుకుంటే అంతగా దాని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

స్కాట్ లాండ్ లోని సెయింట్ అండ్రూస్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో కరోనా వ్యాప్తి విషయంలో అత్యంత ముఖ్యమైన కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధనని బట్టి కరోనా సోకిన వ్యక్తిలో… మొదటి సారి లక్షణం కనిపించిన రోజునుండి… ఇన్ ఫెక్షన్ నుండి బయటపడిన అనంతరం ఐదురోజుల వరకు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాప్తి సైతం ఈ కాలంలో ఎక్కువగా జరుగుతుంది.

ఒక్కసారి వైరస్ శరీరంలోకి చేరాక అది రెట్టింపు వేగంతో పెరుగుతూ వ్యాప్తి చెందుతుందన్న విషయం తెలిసిందే. అయితే లక్షణాలు అసలేమాత్రం లేని వ్యక్తి ఎన్నిరోజులపాటు వైరస్ ని వ్యాప్తి చేయగలడనేది తెలుసుకుని ఉండటం మంచిది.

అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్నదాన్ని బట్టి… కరోనా నుండి కోలుకున్న వ్యక్తుల నుండి కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఇన్ ఫెక్షన్ మొదలైనప్పటినుండి మూడు నెలల వరకు వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ ఫెక్షన్ నుండి కోలుకున్న వ్యక్తుల నుండి వ్యాప్తి చెందే వైరస్… జీవించి ఉన్నది కాదు. కరోనా పేషంట్లలో దీర్ఘకాలం వరకు జీవించి ఉన్న వైరస్ ఉండే అవకాశం లేదని యుకెలో నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది.

కరోనా సోకినవారి నుండి 83 రోజుల వరకు వైరస్ వ్యాప్తి జరుగుతున్నప్పటికీ అందులో చలనమున్న ఆర్ ఎన్ ఎ లేదని…వైరల్ ఆర్ ఎన్ ఎ లోడు ఎక్కువగానే కనబడుతున్నా… లక్షణాలు కనిపించిన తరువాత తొమ్మిది రోజులకు మించి చలనమున్న వైరస్ వ్యాప్తి మాత్రం జరగటం లేదని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది.

లక్షణాలు అతి స్వల్ప స్థాయి నుండి ఒక మాదిరి స్థాయి వరకు ఉన్నవారు లక్షణాలు కనిపించిన అనంతరం పదిరోజుల వరకు, తీవ్రస్థాయిలో వైరస్ లక్షణాలున్నవారు ఇరవై రోజుల వరకు ఇన్ ఫెక్షన్ ని వ్యాప్తి చేయగలుగుతారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతోంది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెబుతున్నదాన్ని బట్టి… కోవిడ్ నుండి కోలుకున్న తరువాత కూడా మూడు నెలల వరకు శ్వాసకోశవ్యవస్థ పై భాగంలో వైరస్ తాలూకూ ఆర్ ఎన్ ఎ గుర్తించదగిన స్థాయిలో కనబడుతుంటుంది… అయితే దాని వలన వైరస్ వ్యాప్తి జరగదు.

First Published:  28 Nov 2020 4:59 AM GMT
Next Story