Telugu Global
International

ఓటమిని ఒప్పుకున్న ట్రంప్... అధికారం బదలాయింపునకు అంగీకారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండో సారి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. తాను ఈ ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తున్నానని, వైట్ హౌస్‌ను వీడే ప్రసక్తి లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. అయితే పలు చర్చల అనంతరం ఎట్టకేలకు ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడటానికి ఒప్పుకున్నారు… ప్రస్తుతానికి తన ఓటమిని ఒప్పుకొని జో బైడెన్‌కు అధికారాన్ని బదలాయించేందుకు అంగీకరించినట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు. కొత్త అధ్యక్షుడు ఎన్నికయిన సమయంలో అధికార బదిలీకి […]

ఓటమిని ఒప్పుకున్న ట్రంప్... అధికారం బదలాయింపునకు అంగీకారం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండో సారి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. తాను ఈ ఎన్నికలపై న్యాయపోరాటం చేస్తున్నానని, వైట్ హౌస్‌ను వీడే ప్రసక్తి లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. అయితే పలు చర్చల అనంతరం ఎట్టకేలకు ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడటానికి ఒప్పుకున్నారు… ప్రస్తుతానికి తన ఓటమిని ఒప్పుకొని జో బైడెన్‌కు అధికారాన్ని బదలాయించేందుకు అంగీకరించినట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.

కొత్త అధ్యక్షుడు ఎన్నికయిన సమయంలో అధికార బదిలీకి ‘జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్’ చీఫ్ కీలకంగా వ్యవహరిస్తారు. ప్రస్తుత చీఫ్ ఎమిలీ మర్ఫీ గత కొన్ని రోజులుగా ట్రంప్‌ను సముదాయిస్తూ వచ్చారు. దీంతో ట్రంప్ అధికార బదిలీకి కావల్సిన ప్రక్రియను ప్రారంభించాలంటూ అధికారులను ఆదేశించారు. కాగా, ట్రంప్ ఈ ప్రకటన చేయడానికంటే ముందే జీఎస్ఏ జో బైడెన్ గెలుపును గుర్తించింది. ఇప్పటికే బైడెన్ బృందానికి మర్ఫీ లేఖ కూడా రాశారు. ట్రంప్ అంగీకారంతో పని లేకపోయినా.. ప్రస్తుత అధ్యక్షుడు కాబట్టి అధికారికంగా ఆయనతో ప్రక్రియ ప్రారంభింపజేశారు.

అధికార బదిలీలో భాగంగా ప్రభుత్వ భవనాలు, అధికారులు, ఇతర పరికరాల వినియోగానికి బైడెన్‌కు అనుమతి లభిస్తుంది. దీనికి కావల్సిన నిధులు అధ్యక్షుడే కేటాయించాలి. ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడంతో మర్ఫీ ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తూ వచ్చారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని జోబైడెన్ స్వాగతించారు. అధికార మార్పిడి సజావుగా సాగేందుకు ట్రంప్ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

First Published:  23 Nov 2020 11:00 PM GMT
Next Story