Telugu Global
International

కరోనాకు బలైన... గాంధీ మునిమనవడు

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులను బలిగొన్న మహమ్మారి..కనీసం మరో పదేళ్లు, 20 ఏళ్ళు బతికే వాళ్ళను కూడా పొట్టన పెట్టుకుంటోంది. ఈ వైరస్ బారిన పడి ఎందరో సినీ, రాజకీయ ఉద్దండులు తమ ప్రాణాలు కోల్పోయి వేదన మిగిల్చారు. తాజాగా కరోనా బారినపడి జాతిపిత మహాత్మా గాంధీజీ మునిమనవడు సతీశ్ ధుపేలియా కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు దిగ్భ్రాంతి చెందారు. ఇటీవలే ఆయనకు కరోనా పరీక్షల్లో పాటిజివ్‌ రాగా… […]

కరోనాకు బలైన... గాంధీ మునిమనవడు
X

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులను బలిగొన్న మహమ్మారి..కనీసం మరో పదేళ్లు, 20 ఏళ్ళు బతికే వాళ్ళను కూడా పొట్టన పెట్టుకుంటోంది. ఈ వైరస్ బారిన పడి ఎందరో సినీ, రాజకీయ ఉద్దండులు తమ ప్రాణాలు కోల్పోయి వేదన మిగిల్చారు. తాజాగా కరోనా బారినపడి జాతిపిత మహాత్మా గాంధీజీ మునిమనవడు సతీశ్ ధుపేలియా కన్నుమూశారు. ఈ విషయం తెలిసి పలువురు దిగ్భ్రాంతి చెందారు.

ఇటీవలే ఆయనకు కరోనా పరీక్షల్లో పాటిజివ్‌ రాగా… చికిత్సకోసం ఆస్పత్రిలో చేరారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో సతీశ్​ మృతిచెందినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా తెలిపారు. సతీశ్ ధుపేలియా (66 ) దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లో నివాసం ఉంటున్నారు. ఆయన మీడియా రంగంలో చాలా కాలంపాటు పనిచేశారు. ఫొటో, వీడియో గ్రాఫర్​గా సేవలందించారు. కొన్నిరోజులుగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీంతో కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో కరోనా సోకినట్టు సమాచారం.

అప్పటి నుంచి సతీశ్ ధుపేలియాకు కరోనా నుంచి కోలుకునేందుకు చికిత్స అందిస్తూ వచ్చారు. మూడు రోజుల క్రితమే పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

సతీశ్ ధుపేలియా దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్ మెంట్ ట్రస్ట్ చూసుకొనేవారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండేవారు. సతీశ్​ అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబసభ్యులు షాక్​కు గురయ్యారు. ఈ విషయం తెలిసి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

First Published:  24 Nov 2020 1:00 AM GMT
Next Story