Telugu Global
National

ఆడపిల్లలను దత్తత తీసుకుంటున్న విదేశీ జంటలు !

మనదేశంలోని అనాథలైన ఆడపిల్లలను దత్తత తీసుకునేందుకు విదేశాలకు చెందిన జంటలు ముందుకొస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో శక్తి మిషన్ అనే పథకం ద్వారా ఎంతోమంది చిన్నారి బాలికలు బంగారు భవిత వైపు అడుగులు వేస్తున్నారు. ఆ రాష్ట్ర అధికారులు ఈ దిశగా మంచి కృషి చేస్తుండటంతో బెల్జియం, ఇటలీ, స్పెయిన్, కెనడా, ఫ్రాన్స్, మాల్తా వంటి దేశాల నుండి విదేశీయులు భారత్ కి వచ్చి పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఒక్క 2019 వ సంవత్సరంలోనే 67 మంది […]

ఆడపిల్లలను దత్తత తీసుకుంటున్న విదేశీ జంటలు !
X

మనదేశంలోని అనాథలైన ఆడపిల్లలను దత్తత తీసుకునేందుకు విదేశాలకు చెందిన జంటలు ముందుకొస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో శక్తి మిషన్ అనే పథకం ద్వారా ఎంతోమంది చిన్నారి బాలికలు బంగారు భవిత వైపు అడుగులు వేస్తున్నారు. ఆ రాష్ట్ర అధికారులు ఈ దిశగా మంచి కృషి చేస్తుండటంతో బెల్జియం, ఇటలీ, స్పెయిన్, కెనడా, ఫ్రాన్స్, మాల్తా వంటి దేశాల నుండి విదేశీయులు భారత్ కి వచ్చి పిల్లలను దత్తత తీసుకుంటున్నారు.

ఒక్క 2019 వ సంవత్సరంలోనే 67 మంది పిల్లలను విదేశీయులు దత్తత తీసుకోగా అందులో 45మంది ఆడపిల్లలున్నారు. ప్రభుత్వ చిల్డ్రన్ హోముల నుండి మన దేశీయులు 290 మంది చిన్నారులను దత్తత తీసుకోగా…వీరిలో 136 మంది బాలికలున్నారు.

ఈ ఏడాది జనవరి 1 నుండి ఈ నెల 22 వరకు దత్తతకు వెళ్లినవారిలో…. విదేశీయులు అడాప్ట్ చేసుకున్న పిల్లలు 35 మంది. వీరిలో 22 మంది బాలికలున్నారు. ఈ ఏడాది మన దేశీయులు దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 131 కాగా వీరిలో 88మంది ఆడపిల్లలున్నారు. గత రెండేళ్లకాలంలో ఒక్క ఉత్తర ప్రదేశ్ నుండే 456 మంది బాలికలు దత్తతకు వెళ్లారు.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శక్తి మిషన్ పేరుతో చేస్తున్న ప్రచారం వల్లనే విదేశీ జంటలకు మన దేశపు బాలికలు ఎక్కువగా దత్తతకు వెళ్లే అవకాశాలు పెరిగాయని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. మిషన్ శక్తి ప్రచారంలో… బాలికల హక్కులు, ఆడశిశువుల భ్రూణ హత్యలు, ఆడపిల్లలపై లైంగిక నేరాలు మొదలైన అంశాలతో పాటు అనాథలైన బాలికలను దత్తత తీసుకునే అవకాశాలను సైతం ప్రచారం చేస్తున్నారు.

ఉపాధ్యాయులు, వలంటీర్లతో పాటు స్వయం సహాయక బృందాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. దత్తతకు వెళుతున్న బాలికల్లో ఎక్కువమంది ఆరేళ్లలోపు వయసున్నవారే. కొంతమంది మాత్రం ఎనిమిది తొమ్మిదేళ్ల వయసున్నవారు ఉంటున్నారు.

First Published:  24 Nov 2020 8:20 AM GMT
Next Story