Telugu Global
National

"వుయ్ వాంట్ టు టెస్ట్ ద ఎలక్షన్ కమిషన్" " సుప్రీంకోర్టు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అభివృద్ధి పనుల విషయంలో ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. స్థానిక ఎన్నికల సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తప్పనిసరి అని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం… నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దరఖాస్తుపై తీసుకున్న నిర్ణయానికి […]

వుయ్ వాంట్ టు టెస్ట్ ద ఎలక్షన్ కమిషన్  సుప్రీంకోర్టు
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అభివృద్ధి పనుల విషయంలో ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. స్థానిక ఎన్నికల సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తప్పనిసరి అని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం… నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దరఖాస్తుపై తీసుకున్న నిర్ణయానికి తగిన కారణాలు ఎస్ఈసీ తన ఆర్డర్ లో తెలియజేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. “వుయ్ వాంట్ టు టెస్ట్ ద ఎలక్షన్ కమిషన్” అని సుప్రీం చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి ఎలా తీసుకుంటారని ఆయన వాదనలు వినిపించారు.

అయితే ఎన్నికలు రద్దు చేయలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని, ఎన్నికల కోడ్ అమలులోనే ఉన్నట్టు భావించాలని ఈసీ తరపు న్యాయవాది పరమేశ్వర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్.. ఎన్నికల పేరుతో ఈసీ ఏదైనా అభివృద్ధి పనులను ఆపివేసిందా అని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. నిర్దిష్ట అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

దరఖాస్తు పై తీసుకున్న నిర్ణయానికి తగిన కారణాలు ఎస్ఈసి తన ఆర్డర్ లో తెలియజేయాలని ఆదేశించారు. ఒకవేళ ఎస్ఈసీ అనుమతి ఇవ్వకపోతే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ, తదుపరి విచారణ నాలుగు వారాలు వాయిదా వేశారు సుప్రీం చీఫ్ జస్టిస్.

First Published:  16 Nov 2020 4:36 AM GMT
Next Story