Telugu Global
Health & Life Style

కాలిన గాయాలపై టూత్ పేస్టు... వద్దు !

వెలుగులను పంచే దీపావళి… ఆనంద దీపావళి కావాలంటే ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కాంతులనిచ్చే దీపావళిని అందరూ శుభప్రదంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోరుకుందాం. అయితే ప్రమాదవశాత్తూ… ఏవైనా కాలిన గాయాలైతే… వాటి తీవ్రత పెరగకుండా చూసుకోవాలి. గురుగ్రామ్ లోని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శిల్పీ భదానీ ఈ విషయంలో కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. అవి మీకోసం చాలామంది గాలిన గాయాలపై ఐస్ నీళ్లు పోయటం, ఐస్ ముక్కలను ఉంచడం, టూత్ పేస్ట్ రాయటం […]

కాలిన గాయాలపై టూత్ పేస్టు... వద్దు !
X

వెలుగులను పంచే దీపావళి… ఆనంద దీపావళి కావాలంటే ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కాంతులనిచ్చే దీపావళిని అందరూ శుభప్రదంగా, సురక్షితంగా జరుపుకోవాలని కోరుకుందాం. అయితే ప్రమాదవశాత్తూ… ఏవైనా కాలిన గాయాలైతే… వాటి తీవ్రత పెరగకుండా చూసుకోవాలి. గురుగ్రామ్ లోని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శిల్పీ భదానీ ఈ విషయంలో కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. అవి మీకోసం

  • చాలామంది గాలిన గాయాలపై ఐస్ నీళ్లు పోయటం, ఐస్ ముక్కలను ఉంచడం, టూత్ పేస్ట్ రాయటం లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ మంచికంటే చెడే ఎక్కువ చేస్తాయి.
  • కాలిన శరీర భాగాన్ని ధారగా నీళ్లు వస్తున్న పంపు కింద ఉంచాలి. దీంతో ఆ ప్రాంతం చల్లబడి లోపలి వరకు కాలకుండా ఉంటుంది. గాయం తీవ్రత తగ్గుతుంది. ఇక టూత్ పేస్టుని పూయటం వలన అందులోని షుగర్ కారణంగా ఇన్ ఫెక్షన్ కి గురయ్యే అవకాశం పెరుగుతుంది.
  • ఐదునిముషాలపాటు పైపు కింద ఉంచిన తరువాత కాలిన భాగంపై యాంటీ బయోటిక్ ఆయింట్ మెంట్ ని అప్లయి చేయాలి. సిల్వర్ బేస్ ఉన్న ఆయింట్ మెంట్ ని వాడటం మంచిది. బొబ్బలు వస్తే చిదపకుండా డాక్టరుని సంప్రదించాలి. పెయిన్ కిల్లర్స్ ని వాడటం వలన నొప్పి మంట తగ్గుతాయి. కాలిన గాయాలను మూసేలా కట్టు కట్టకూడదు అనుకుంటారు చాలామంది కానీ గాయాన్ని మూసేస్తూ డ్రస్సింగ్ చేయాలి. చేతులకు గాయాలైతే చికిత్సలో ఫిజియోథెరపీ కూడా ఉంటుంది.
  • కాలిన గాయాలతో తమ క్లినిక్ కి ఎవరైనా వచ్చినప్పుడు గాయాన్ని ముట్టుకోకుండానే ఆ ప్రాంతాన్ని మొదట బాగా కడుగుతామని… గాయాలను రబ్ చేయటం, బొబ్బలను చిదపటం లాంటివి చేయబోమని డాక్టర్ శిల్పి అన్నారు. శరీరంలోపల కాలిన గాయం ఎంతవరకు ఉందనేదాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. అవసరమైన మందులతో పాటు డ్రస్సింగ్ ప్రత్యేకంగా చేస్తామన్నారామె. యాంటీబయోటిక్ ఆయింట్ మెంట్ తో గాయానికి అంటుకోని బర్న్ డ్రస్సింగ్ ని చేస్తామని తెలిపారామె. బాండేజి సవ్యంగా ఉండాలని, వైద్య నిపుణుల ఆధ్వర్యంలో మందులు వాడాలని సూచించారు శిల్పి.

పిల్లలు బాణాసంచా కాలుస్తున్నపుడు పెద్దవాళ్లు తప్పకుండా పక్కనే ఉండాలని ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. అయినా దీపావళి పండుగ తరువాతరోజు గాయాల పాలైన పిల్లల గురించిన వార్తలు కనబడుతుంటాయి. చాలా బాధకలిగిస్తుంటాయవి. అందుకే దీపావళి నాడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.

First Published:  14 Nov 2020 3:52 AM GMT
Next Story