Telugu Global
Cinema & Entertainment

మహాసముద్రం మెరిసింది

ఏడాదికి పైగా మహాసముద్రం ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్న దర్శకుడు అజయ్ భూపతి, ఆ ప్రాజెక్టుపై ఎందుకంత నమ్మకంగా ఉన్నాడో తెలియజేసే సందర్భం ఇది. దీపావళి కానుకగా ఈ సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు. సినిమాపై ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది ఆ థీమ్ పోస్టర్. సాయం సంధ్యవేళ.. ఈ గట్టున ఓ జంట.. అటు వైపు ఓ అబ్బాయి రైలు అందుకోవడానికి పరుగు.. ఇంకాస్త లోతుగా గమనిస్తే.. ఓ తుపాకి.. దానికి ఎదురుగా నిలబడ్డ […]

మహాసముద్రం మెరిసింది
X

ఏడాదికి పైగా మహాసముద్రం ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్న దర్శకుడు అజయ్ భూపతి, ఆ ప్రాజెక్టుపై ఎందుకంత నమ్మకంగా ఉన్నాడో తెలియజేసే సందర్భం ఇది. దీపావళి కానుకగా ఈ సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు. సినిమాపై ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది ఆ థీమ్ పోస్టర్.

సాయం సంధ్యవేళ.. ఈ గట్టున ఓ జంట.. అటు వైపు ఓ అబ్బాయి రైలు అందుకోవడానికి పరుగు.. ఇంకాస్త లోతుగా గమనిస్తే.. ఓ తుపాకి.. దానికి ఎదురుగా నిలబడ్డ మరో వ్యక్తి.. ఇలా ఎంతో ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు మహాసముద్రం థీమ్ పోస్టర్.

ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు మంచి యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉందనే విషయాన్ని ఈ థీమ్ పోస్టర్ చెబుతోంది. మరోవైపు మహాసముద్రం ఎంతో లోతుగా ఉంటుందో.. మనుషుల మనసులు, వాళ్ల ఆలోచనలు కూడా అంతే లోతుగా ఉంటాయనే అర్థం వచ్చేలా దీనికి క్యాప్షన్ ఇచ్చారు.

శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది మహాసముద్రం.

Next Story