Telugu Global
International

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ‘మహిళ’ కు అర్థాలు మార్చారు !

స్త్రీ అనే పదానికి తెలుగులో మహిళ, మగువ, ముదిత, లలన లాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఈ పదాలన్నింటికీ అర్థం స్త్రీ అనే. ఇవన్నీ కాకుండా స్త్రీ అంటే ప్రధాన అర్థం మనిషి. మానవరూపంలో ఉన్న వ్యక్తి. అయితే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ మాత్రం ‘ఉమన్’ అనే పదానికి చాలా విపరీతమైన అర్ధాలను ఇచ్చింది. బిచ్ (తిరుగుబోతు, ఆడకుక్క), బింట్ (గర్ల్ ఫ్రెండ్ అనే అర్ధం వస్తుంది), వెంచ్ (పడుచు, చిన్నది, వేశ్య, బానిస)… ఇలాంటి నెగెటివ్ […]

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ‘మహిళ’ కు అర్థాలు మార్చారు !
X

స్త్రీ అనే పదానికి తెలుగులో మహిళ, మగువ, ముదిత, లలన లాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఈ పదాలన్నింటికీ అర్థం స్త్రీ అనే. ఇవన్నీ కాకుండా స్త్రీ అంటే ప్రధాన అర్థం మనిషి. మానవరూపంలో ఉన్న వ్యక్తి. అయితే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ మాత్రం ‘ఉమన్’ అనే పదానికి చాలా విపరీతమైన అర్ధాలను ఇచ్చింది. బిచ్ (తిరుగుబోతు, ఆడకుక్క), బింట్ (గర్ల్ ఫ్రెండ్ అనే అర్ధం వస్తుంది), వెంచ్ (పడుచు, చిన్నది, వేశ్య, బానిస)… ఇలాంటి నెగెటివ్ అర్థాలనిచ్చే పదాలను ఉమన్… అనే పదానికి అర్థాలుగా పేర్కొంది. అయితే ఇదంతా ఇంతకుముందు… దీనిపై ఒక వ్యతిరేక పోరాటం మొదలవటంతో తన తాజా ఎడిషన్ లో ఈ విపరీత అర్థాలను కొంతవరకు మార్చింది.

మరియా బాట్రిస్ జియోవనార్డీ అనే మహిళ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఉమన్ అనే పదానికి ఉన్న విపరీత అర్థాలపై ఆన్ లైన్ పిటీషన్ దాఖలు చేయగా… 34,000 మంది ఆమెకు మద్ధతుగా సంతకాలు చేశారు. ఉమన్ కి పర్యాయపదాలుగా ఉన్న బిచ్, బింట్, పీస్, బిట్, బ్యాగేజి, పెట్టీకోట్, బర్డ్ లాంటి పదాలను తొలగించాలని తమ పిటీషన్ లో డిమాండ్ చేశారు. 18నుండి 24 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు చాలావరకు ఆన్ లైన్ లో అసభ్యకరమైన తిట్లకు, అవమానాలకు గురవుతున్నారని…ఇదంతా మారాలంటే మన భాషలో మహిళలను కించపరచే పదాలను మొదట తొలగించాలని అది డిక్షనరీ నుండే మొదలుకావాలని మరియా అన్నారు.

గత సంవత్సరం నుండి ఈ పోరాటం జరుగుతుండగా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ… తన తాజా ఎడిషన్ లో ఉమన్ అర్థం విషయంలో కొన్ని మార్పులను చేసింది. ఉమన్ కి పర్యాయపదాలుగా పేర్కొన్న బిచ్, బింట్… అనే పదాలను తొలగించలేదు కానీ వీటిని మహిళలను అగౌరవపరచే పదాలుగా మాత్రం డిక్షనరీ పేర్కొంది. వెంచ్ అనే పదాన్ని పూర్తిగా తీసివేసింది. ఎల్ జి బి టి (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్) కమ్యూనిటీని పరిగణనలోకి తీసుకుని కూడా ఉమన్ కి ఉన్న అర్దాన్ని మార్చాలని డిమాండ్ చేయటంతో లైంగికతలోని భిన్నత్వం… అంశాన్ని పరిగణనలోకి తీసుకుని కూడా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో మార్పులను చేశారు.

ఇంతకుముందు ఉమన్ కి…. ఒక పురుషుని భార్య, గర్ల్ ఫ్రెండ్, లేదా ప్రేమికురాలు అనే అర్ధాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి కి భార్య, గర్ల్ ఫ్రెండ్, ఆడ స్నేహితురాలు అంటూ అర్థం ఇచ్చారు. ఒక పురుషుడికి భార్య… అనే పదాన్ని మార్చి ఒక వ్యక్తికి… అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు మ్యాన్…. అనేపదానికి భర్త, ప్రేమికుడు… అనే అర్థాలు ఉండగా… వాటిని మార్చి… ఒక వ్యక్తికి భర్త, బాయ్ ఫ్రెండ్ లేదా మగ ప్రేమికుడు… అనే అర్థాలను ఇచ్చారు. ఇరువురు స్త్రీల మధ్య, ఇరువురు పురుషుల మధ్య కూడా ప్రేమ ఉండవచ్చు… అనే కోణంలో ఈ మార్పులు చేశారు. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో తాము ఆశించిన మార్పుల్లో కొన్ని జరిగాయని, ఇంకా పూర్తి మార్పులు వచ్చేవరకు పోరాటం చేస్తామని మరియా అన్నారు.

First Published:  10 Nov 2020 9:15 PM GMT
Next Story