Telugu Global
Health & Life Style

ఇద్దరికోసం తినాలనేం లేదు...! " కరీనా కపూర్

రెండోసారి గర్భం దాల్చిన బాలీవుడ్ నటి కరీనా కపూర్… కాబోయే తల్లిగా తాను తీసుకుంటున్న ఆహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి మాట్లాడింది. ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతతనిచ్చే మార్గాలు… ఇవన్నీ సవ్యంగా నిపుణుల సూచనల ప్రకారం ఆమె ఆచరిస్తుందనటంలో సందేహంలేదు. ఆమె మాటలు… తప్పకుండా కాబోయే తల్లులకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఆ వివరాలు… కడుపుతో ఉన్నపుడు బిడ్డకు కూడా కలిపి ఇద్దరికి తినాలని చాలామంది అనుకుంటారు. అలా తప్పకుండా ఎక్కువగా తినాలనేం లేదు. మనం […]

ఇద్దరికోసం తినాలనేం లేదు...!  కరీనా కపూర్
X

రెండోసారి గర్భం దాల్చిన బాలీవుడ్ నటి కరీనా కపూర్… కాబోయే తల్లిగా తాను తీసుకుంటున్న ఆహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి మాట్లాడింది. ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతతనిచ్చే మార్గాలు… ఇవన్నీ సవ్యంగా నిపుణుల సూచనల ప్రకారం ఆమె ఆచరిస్తుందనటంలో సందేహంలేదు. ఆమె మాటలు… తప్పకుండా కాబోయే తల్లులకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే ఆ వివరాలు…

  • కడుపుతో ఉన్నపుడు బిడ్డకు కూడా కలిపి ఇద్దరికి తినాలని చాలామంది అనుకుంటారు. అలా తప్పకుండా ఎక్కువగా తినాలనేం లేదు. మనం ఏ సమయంలో అయినా మనకు కావలసినంతే తింటాము. గర్భం దాల్చిన సమయంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. అందుకే కొద్ది మొత్తాల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి. నేను అలాగే తింటాను. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం పెరుగు ఎక్కువగా తీసుకుంటాను. పెరుగు జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇది నేను ఎప్పుడూ చేసే పని. అయితే నేను తింటున్న పెరుగు… నాణ్యమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకుంటాను.
  • ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఏదీ ఎక్కువగా చేయకూడదు. వ్యాయామం విషయంలో కూడా ఇదే పాటించాలి. మనం మన శరీరం ఏం చెబుతుందో గమనించాలి. దాని అవసరాలు గ్రహించాలి. కాబోయే తల్లులు సైతం నలభై నిముషాలపాటు వ్యాయామం చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కొంతమంది గర్భవతులు ఐదారు కిలోమీటర్లు వాకింగ్ చేస్తుంటారు. మనకు నచ్చిన అనుకూలమైన వ్యాయామం ఏదైనా చేయవచ్చు. నేను కనీసం గంటపాటు యోగా చేస్తుంటాను.
  • ఈ కరోనా కాలంలో గర్భవతులుగా ఉన్నవారికి నేను చెప్పేది ఏమిటంటే… నెగెటివ్ ఆలోచనలకు, మనుషులకు, వార్తలకు దూరంగా ఉండండి. మీ మనసుకి నచ్చింది తినండి. ఆహారం, వ్యాయామం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. పాలు, పెరుగు, నెయ్యి… వీటితో పాటు ఇంట్లో తయారైన ఆహారం…ఇదే నేను అనుసరించే ఆరోగ్యసూత్రం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే కానీ… కరోనాకు ముందు మన జీవితం ఎలా ఉందో… సాధ్యమైనంత వరకు అలాగే ఉండేలా చూసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.
  • నా రోజువారీ ఆహారం గురించి చెప్పాలంటే… నిద్రలేవగానే గ్లాసు పాలు తాగటం నాకు చాలాకాలంగా అలవాటు. పాలకు సంబంధించిన ఆహారం ఏదైనా మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యి మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని సైతం ఇస్తుంది. నేను తినే పరోటాలు, పప్పు అన్నింట్లో నెయ్యి తప్పకుండా ఉంటుంది. అలాగే భోజనంలో తప్పకుండా పెరుగు తీసుకుంటాను.
First Published:  9 Nov 2020 7:19 AM GMT
Next Story