Telugu Global
International

ఓహ్... ఆమె ఆలోచన అద్భుతం !

ఇతరుల అవసరాలను గుర్తించి వారి కోసం ఏమైనా చేయాలని తపించేవారు కొందరే ఉంటారు. కశ్మీరీ మహిళ ఇర్ఫానా జర్గార్ కూడా అలాంటి వ్యక్తే.  తోటి మహిళల ఇబ్బందులను, సమస్యలను గుర్తించి వారికోసం ఓ మంచి సహాయం అందిస్తున్నారామె. శ్రీనగర్ లోని పబ్లిక్ వాష్ రూముల్లో శానిటరీ కిట్స్ ని ఉంచుతున్నారు. నెలసరి సమయంలో ఆరోగ్యం, పరిశుభ్రతలపై నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా ఆమె ఈ పని చేస్తున్నారు. ఇంట్లో తయారుచేసిన ఇవా సేఫ్టీ డోర్ శానిటరీ నేప్ కిన్ […]

ఓహ్... ఆమె ఆలోచన అద్భుతం !
X

ఇతరుల అవసరాలను గుర్తించి వారి కోసం ఏమైనా చేయాలని తపించేవారు కొందరే ఉంటారు. కశ్మీరీ మహిళ ఇర్ఫానా జర్గార్ కూడా అలాంటి వ్యక్తే. తోటి మహిళల ఇబ్బందులను, సమస్యలను గుర్తించి వారికోసం ఓ మంచి సహాయం అందిస్తున్నారామె. శ్రీనగర్ లోని పబ్లిక్ వాష్ రూముల్లో శానిటరీ కిట్స్ ని ఉంచుతున్నారు. నెలసరి సమయంలో ఆరోగ్యం, పరిశుభ్రతలపై నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా ఆమె ఈ పని చేస్తున్నారు. ఇంట్లో తయారుచేసిన ఇవా సేఫ్టీ డోర్ శానిటరీ నేప్ కిన్ కిట్ లను పబ్లిక్ టాయ్ లెట్లలో ఉంచుతున్నారామె. ఈ కిట్ లో శానిటరీ ప్యాడ్స్ తో పాటు శానిటైజర్లు, బేబీ డైపర్లు, తడి టిష్యులు కూడా ఉంటాయి.

మొదట తను ఉంటున్న ప్రాంతంలో 15 వాష్ రూముల్లో ఈ కిట్ లను ఉంచేవారామె. తమ కశ్మీరీ మహిళలు బయటకు వెళ్లినప్పుడు నెలసరి ఇబ్బందులతో నిస్సహాయంగా ఉండకూడదనేది తన లక్ష్యమంటున్నారు ఇర్ఫానా. ఈమె ఉద్యోగస్తురాలు. దాంతో తను చేస్తున్న సామాజికసేవకు అయ్యే ఖర్చుని తన సంపాదన నుండే ఖర్చుపెడుతున్నారు. లాక్ డౌన్ ముందునుండే ఉచితంగా కిట్ లను అందించడం మొదలు పెట్టి… ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

లాక్ డౌన్ కాలంలో అయితే ప్రతి ఇంటికీ వెళ్లి శానిటరీ నేప్ కిన్ల కిట్ లను అందించారామె. కశ్మీర్ వ్యాలీలో ఉన్న మహిళలందరూ నెలసరి సమయంలో చాలా ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన స్థితిలో భద్రతా భావంతో ఉండాలని ఆశిస్తున్నారు ఇర్ఫానా. శ్రీనగర్ లో ఇప్పుడు చాలామంది ఆమెని అభినందిస్తున్నారు.

ఇర్ఫానా స్త్రీల కోణంలోంచే కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ పని చేస్తున్నారని, బయటకు వెళ్లే ఉద్యోగినులు విద్యార్థినులకు ఆమె అందిస్తున్న కిట్ లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని మహిళలు మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు ఎంతో నిర్లక్ష్యానికి గురయిన మహిళల ఆరోగ్యం, గౌరవం, వ్యక్తిగత శుభ్రతలకు సంబంధించిన శానిటరీ నేప్ కిన్లను గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. వాటి అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇర్ఫానాలా మరింత మంది ఈ కోణంలో ఆలోచించి పనిచేయాల్సిన అవసరం మన దేశంలో ఉంది.

First Published:  7 Nov 2020 9:44 PM GMT
Next Story