అమెరికాలో ఇప్పుడేం జరగబోతున్నది?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆయనే కాబోయే అధ్యక్షుడు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగ్గా.. ప్రమాణ స్వీకారం మాత్రం జనవరి 20న చేస్తారు. గత 200 ఏళ్లుగా అమెరికాలో ఇలాగే చేస్తున్నారు. మరి అప్పటి వరకు అమెరికాలో ఏం జరుగుతున్నదనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతీ రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారులు అధికారికంగా బైడెన్‌కు 270 ఎలక్టోరల్ […]

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆయనే కాబోయే అధ్యక్షుడు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3న జరగ్గా.. ప్రమాణ స్వీకారం మాత్రం జనవరి 20న చేస్తారు. గత 200 ఏళ్లుగా అమెరికాలో ఇలాగే చేస్తున్నారు. మరి అప్పటి వరకు అమెరికాలో ఏం జరుగుతున్నదనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రతీ రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారులు అధికారికంగా బైడెన్‌కు 270 ఎలక్టోరల్ వోట్లు లభించినట్లు ప్రకటించగానే అమెరికా సీక్రెట్ సర్వీస్ రెండుగా విడిపోతుంది. ఒక బృందం ప్రెసిడెంట్ ట్రంప్, మరో బృందం ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్‌ను అనుసరిస్తుంది. సీఐఏ ట్రంప్, బైడెన్ ఇద్దరికీ ఇంటెలిజెన్స్ సమాచారం అందిస్తుంటుంది.
కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా సీఐఏపై నిఘా ఉంచుతుంది. అలాగే శ్వేతసౌధంలోని ఉద్యోగులు కొత్త ప్రెసిడెంట్ కోసం మార్పులు చేపడతారు. జనవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు పాత అధ్యక్షుడి వస్తువులను బయటకు తరలిస్తారు. అదే సమయంలో కొత్త అధ్యక్షుడి వస్తువులను భవనంలోకి చేర్చుతారు.
జనవరి నుంచి శ్వేతసౌధం అద్దె ట్రంప్ జీతం నుంచి కోత వేయడం ఆగిపోతుంది. అదే సమయంలో జనవరి నుంచి బైడెన్ జీతంలో నుంచి కోత ప్రారంభిస్తారు. శ్వేతసౌధం బాస్‌గా మెలానియా ట్రంప్ బాధ్యతలు జనవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు ముగిసిపోతాయి.
అమెరికాకు చెందిన సీఐఏ, ఎఫ్‌బీఐ, అటార్నీ జనరల్ జనవరి 20 మధ్యాహ్నం నుంచి ట్రంప్‌తో సంబంధాలు తెంచుకుంటారు. కానీ ట్రంప్ జీవితాంతం సీక్రెస్ సర్వీస్ అతడికి రక్షణగా ఉంటుంది.
అధికారిక వాహనం ది బీస్ట్, విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ చివరి సారిగా ట్రంప్‌కు వీడ్కోలు పలికి బైడెన్ కోసం సిద్దపడతాయి. బీస్ట్‌లో బైడెన్ బ్లడ్ గ్రూప్‌కు చెందిన రక్తాన్ని తీసుకెళ్తారు.
ఈ పనులన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి తప్ప ప్రత్యేకంగా ఉత్తర్వులు ఎవరూ ఇవ్వరు. గత 200 ఏళ్లుగా అమెరికాలో ఇదే విధంగా అధికార మార్పిడి జరుగుతున్నది.