Telugu Global
Health & Life Style

పిల్లల్లో కోవిడ్ లేకపోయినా... దాని నుండి కాపాడే యాంటీ బాడీలు !

ఒకసారి వైరస్ బారిన పడినవారిలో దానిని ఎదుర్కొనే యాంటీబాడీలు ఉండటం సహజం. కానీ కొంతమందిలో… ముఖ్యంగా చిన్నపిల్లల్లో వారు అంతకు ముందు కోవిడ్ కి గురికాకపోయినా దానిని నిరోధించే యాంటీబాడీలు ఉంటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతకుముందు కేవలం జలుబుని మాత్రమే కలిగించే ఇతర కరోనా వైరస్ కి గురి అయిఉండి… ఆ వైరస్ గుణాలు ఇప్పటి కోవిడ్ 19 వైరస్ లాగే ఉండి ఉంటే…అలాంటి వారిలో కోవిడ్ 19ని ఎదుర్కొనే యాంటీబాడీలు… ఆ ఇన్ ఫెక్షన్ సోకకపోయినా… […]

పిల్లల్లో కోవిడ్ లేకపోయినా... దాని నుండి కాపాడే యాంటీ బాడీలు !
X

ఒకసారి వైరస్ బారిన పడినవారిలో దానిని ఎదుర్కొనే యాంటీబాడీలు ఉండటం సహజం. కానీ కొంతమందిలో… ముఖ్యంగా చిన్నపిల్లల్లో వారు అంతకు ముందు కోవిడ్ కి గురికాకపోయినా దానిని నిరోధించే యాంటీబాడీలు ఉంటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతకుముందు కేవలం జలుబుని మాత్రమే కలిగించే ఇతర కరోనా వైరస్ కి గురి అయిఉండి… ఆ వైరస్ గుణాలు ఇప్పటి కోవిడ్ 19 వైరస్ లాగే ఉండి ఉంటే…అలాంటి వారిలో కోవిడ్ 19ని ఎదుర్కొనే యాంటీబాడీలు… ఆ ఇన్ ఫెక్షన్ సోకకపోయినా… ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు వివరిస్తున్నారు. సైన్స్ అనే పత్రికలో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.

కోవిడ్ 19కి స్పందిస్తున్న యాంటీబాడీలను గురించి పరిశోధన చేస్తున్న తరుణంలో శాస్త్రవేత్తలు పైన పేర్కొన్న విషయాన్ని గమనించారు. కోవిడ్ 19 కి గురయినవారి రక్తాన్ని, వైరస్ సోకనివారి రక్తాన్ని పరీక్షించి చూసినప్పుడు… ఆశ్చర్యకరంగా కోవిడ్ లేని కొంతమందిలో దానిని ఎదుర్కోగల యాంటీబాడీలను గమనించారు. తమ పరిశోధనను మరింతగా నిర్ధారించుకునేందుకు కోవిడ్ 19 లేని కాలంలో…. 2011-18 మధ్యకాలంలో సేకరించిన 300 రక్త నమూనాలను పరిశీలించారు. దాదాపు అన్ని బ్లడ్ శాంపిళ్లలోనూ సాధారణ జలుబుని కలిగించే కరోనా వైరస్ ని ఎదుర్కొనే యాంటీ బాడీలు ఉండటం పరిశోధకులు గుర్తించారు.

జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇలాంటి వైరస్ లకు గురవుతారని ఈ పరిశోధన నిరూపిస్తోంది. అధ్యయనంకోసం పరీక్షించిన పెద్దవయసువారి రక్తపు నమూనాల్లో ప్రతి ఇరవై మందిలో ఒకరిలో కోవిడ్ 19కి ప్రతిస్పందించగల యాంటీ బాడీలు ఉన్నాయి. ఆరు నుండి పదహారేళ్ల వయసున్నవారిలో ఈ యాంటీబాడీలు మరింత ఎక్కువగా ఉన్నాయి. అందుకే పిల్లల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని వారు చెబుతున్నారు.

ఇప్పుడు ఈ తరహా పరిశోధనలను చాలా పెద్ద స్థాయిలో ఇంపీరియల్ కాలేజి లండన్, యూనివర్శిటీ కాలేజి లండన్ నిర్వహిస్తున్నాయి. శరీరంలోని భిన్నమైన యాంటీబాడీలు, రక్షణ వ్యవస్థలు కోవిడ్ నుండి ఎలా కాపాడుతున్నాయి… కోవిడ్ 19 ఏ పరిస్థితుల్లో తీవ్రరూపం దాలుస్తోంది… అనే అంశాలను ఈ పరిశోధనలో అధ్యయనం చేస్తున్నారు.

First Published:  8 Nov 2020 6:40 AM GMT
Next Story