Telugu Global
International

ఆ ప్రశ్న... గూగుల్ కి అలా అర్థమైంది !

గూగుల్ తల్లి మనం ఏం అడిగినా సమాధానం చెప్పే అద్భుతమే. అయితే ఒక్కోసారి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కనిపించే ఫలితాలు మనం అడిగిన దానికి సంబంధం లేకుండా అయోమయానికి గురిచేసేవిగా కూడా ఉంటాయి. ఎందుకంటే… గూగుల్ కి మనం చెప్పిన పదాలను పట్టుకుని వెతుక్కుంటూ పోవటం తెలుసు కానీ… మన ఉద్దేశ్యం అర్థం చేసుకునే విచక్షణ లేదు మరి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షఎన్నికలు జరిగిన సందర్భంగా చాలామంది గూగుల్ ని అడుగుతున్న ప్రశ్న ‘కాబోయే అమెరికా […]

ఆ ప్రశ్న... గూగుల్ కి అలా అర్థమైంది !
X

గూగుల్ తల్లి మనం ఏం అడిగినా సమాధానం చెప్పే అద్భుతమే. అయితే ఒక్కోసారి గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కనిపించే ఫలితాలు మనం అడిగిన దానికి సంబంధం లేకుండా అయోమయానికి గురిచేసేవిగా కూడా ఉంటాయి. ఎందుకంటే… గూగుల్ కి మనం చెప్పిన పదాలను పట్టుకుని వెతుక్కుంటూ పోవటం తెలుసు కానీ… మన ఉద్దేశ్యం అర్థం చేసుకునే విచక్షణ లేదు మరి.

ప్రస్తుతం అమెరికా అధ్యక్షఎన్నికలు జరిగిన సందర్భంగా చాలామంది గూగుల్ ని అడుగుతున్న ప్రశ్న ‘కాబోయే అమెరికా అధ్యక్షుడు ఎవరు’ అనేది. అయితే ఈ ప్రశ్నని టైప్ చేసి సెర్చ్ చేస్తే గూగుల్ ఒక కళాకృతిని చూపిస్తోంది. దీనిని రూపొందించింది… లాస్ ఎంజిల్స్ కి చెందిన గ్రెచెన్ ఆండ్రూ. ప్రశ్నకు సమాధానానికి సంబంధం లేకుండా ఇలా చూపించడం వెనుక గూగుల్ తప్పేమీ లేదు.

‘ది నెక్ట్స్ అమెరికన్ ప్రెసిడెంట్ ’ అనే పేరుతో ఆండ్రూ ఒక ఆర్ట్ వర్క్ సిరీస్ ని రూపొందించింది. ఆమె ఇంతకుముందు గూగుల్ లో పనిచేసింది. దాంతో తనకు తెలిసిన కళని, టెక్నాలజీని రెండింటినీ కలిపి… అధ్యక్షుడు ఎవరు అని అడిగితే గూగుల్ సెర్చ్ లో తన ఆర్ట్ వర్క్ కనిపించేలా పోస్టులు చేసి ప్రయోగం చేసింది. ఎన్నికల సమయంలో ఇంటర్నెట్ యూజర్లు… తప్పకుండా… తరువాత అధికారంలోకి వచ్చేది ఎవరు… అనే విషయంపై సెర్చ్ చేస్తారు కనుక… కావాలనే ఆమె తన ఆర్ట్ వర్క్ కి ఆ పేరు పెట్టింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని తనకు అనుకూలంగా ఫలితం (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్) ఇచ్చేలా… ఆండ్రూ చాలా తెలివిని కనబరచింది. సంక్లిష్టమైన గీతలు ఆకారాలతో ఉన్న తన కళాకృతి… కాబోయే నూతన అమెరికా అధ్యక్షుని ఎంపిక పరంగా తనకున్న కలలు, ఆశలను ప్రతిబింబిస్తున్నదని ఆండ్రూ అఫీషియల్ వెబ్ సైట్ పేర్కొంది. అధికారంలోకి రాబోతున్న నూతన అధ్యక్షుడిలో మీకు ఎలాంటి లక్షణాలు ఉండాలని అనుకుంటున్నారో ఆలోచించుకోమని ఈ ఆర్ట్ వర్క్ ప్రాజెక్టు ప్రజలను ప్రేరేపిస్తుందని ఆ వెబ్ సైట్ తెలిపింది.

నెక్ట్స్ అమెరికన్ ప్రెసిడెంట్… ప్రేమ, సామరస్యం, ఎంపిక, ప్రకృతి, ప్రజాస్వామ్యం, సంతోషం, సైన్స్, అంతర్జాతీయ సంస్థలు, చట్టానికి సర్వోన్నత అధికారం… వీటన్నింటిలో నమ్మకం కలిగి ఉండాలని ఆండ్రూ కోరుకుంటోంది.

https://www.instagram.com/p/CHGVz-ZFjn4/

First Published:  5 Nov 2020 1:48 AM GMT
Next Story