Telugu Global
International

బ్రిటన్ యువరాణి... మొట్టమొదటిసారి అమెరికాలో ఓటు !

బ్రిటీష్ రాజకుటుంబంలోని సభ్యురాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయటం… మొదటిసారి ఇది జరిగింది. బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య యువరాణి మేఘన్ మార్కెల్ తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు. మేఘన్ కి సన్నిహితులైన వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే… ఎర్లీ ఓటింగ్ లేదా ప్రీ పోల్ ఓటింగ్ పద్ధతి ద్వారా ఆమె ఇంతకుముందే ఓటు వేశారా లేదా తాము నివాసముంటున్న శాంటా బార్బరాలో మంగళవారం నాడు ఓటు వేశారా అనేది […]

బ్రిటన్ యువరాణి... మొట్టమొదటిసారి అమెరికాలో ఓటు !
X

బ్రిటీష్ రాజకుటుంబంలోని సభ్యురాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయటం… మొదటిసారి ఇది జరిగింది. బ్రిటన్ యువరాజు హ్యారీ భార్య యువరాణి మేఘన్ మార్కెల్ తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు.

మేఘన్ కి సన్నిహితులైన వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే… ఎర్లీ ఓటింగ్ లేదా ప్రీ పోల్ ఓటింగ్ పద్ధతి ద్వారా ఆమె ఇంతకుముందే ఓటు వేశారా లేదా తాము నివాసముంటున్న శాంటా బార్బరాలో మంగళవారం నాడు ఓటు వేశారా అనేది తెలియదని ఆ వర్గాలు తెలిపాయి.

ఈ ఎన్నికలకు ముందు మేఘన్ తన అభిమానులకు…. ముఖ్యంగా మహిళలకు… తప్పకుండా ఓటు హక్కుని వినియోగించుకోమని విజ్ఞప్తి చేశారు. మేఘన్ ఆమె భర్త హ్యారీ ఇరువురూ అమెరికా అధ్యక్ష ఎన్నికల పట్ల చాలా ఆసక్తిని చూపించారని, వారు ఫలితాల కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని…ఈ దంపతులకు సన్నిహితంగా ఉండే మిత్రులు మీడియాకు తెలిపారు.

మేఘన్ మార్కెల్ కి ముందు బ్రిటీష్ రాజకుటుంబంలోకి సభ్యురాలిగా వెళ్లిన అమెరికన్ మహిళ మరొకరు ఉన్నారు. ఆమె విండ్సర్ డచెస్ అయిన వాలిస్ సింప్సన్. ఆమె మాజీ బ్రిటీష్ రాజు ఎనిమిదవ ఎడ్వర్డ్ ని వివాహం చేసుకుంది. అయితే వాలిస్ సింప్సన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిందో లేదో తెలియదు.

ఎన్నికలకు ముందు ఆగస్టులో మేఘన్ మార్కెల్… అమెరికన్ ఫెమినిస్ట్, జర్నలిస్ట్ సామాజిక రాజకీయ కార్యకర్త అయిన గ్లోరియా స్టీనెమ్ తో మహిళల ఓటు హక్కుపై ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల హక్కుల గురించి మాట్లాడాలంటే మేఘన్ ఎప్పుడూ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. అంతకుముందు ఓటుకున్న ప్రాధాన్యతని తెలియజేస్తూ ఓ ఆన్ లైన్ ఓటర్ల సదస్సులో సైతం ఆమె పాల్గొన్నారు.

హ్యారీ బ్రిటీష్ పౌరుడు కనుక అతనికి అమెరికాలో ఓటు వేసే హక్కు లేదు. అయితే హ్యారీ యుకెలో సైతం ఎప్పుడూ ఓటు వేయలేదు. ఈ విషయాన్ని తనే వెల్లడించాడు. రాజకుటుంబ సభ్యుడు కావటం వలన రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండాల్సి రావడమే అందుకు కారణం.

First Published:  4 Nov 2020 10:00 PM GMT
Next Story