Telugu Global
International

యాపిల్‌కు భారీ జరిమానా

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్‌కు ఆ దేశంలోని కోర్టు భారీ జరిమానా విధించింది. 10 ఏళ్ల క్రితం పేటెంట్ హక్కుల విషయంలో విర్‌నెట్ఎక్స్ కార్ప్ అనే సంస్థ యాపిల్‌పై న్యాయపోరాటానికి దిగింది. వాదోపవాదాలు విన్న కోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం 502.8 మిలియన్ డాలర్లు (దాదాపు 37 వేల కోట్ల రూపాయలు) పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. విర్‌నెట్ఎక్స్ కార్ప్ అనే సంస్థ అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం ఒక కొత్త సాంకేతికతను […]

యాపిల్‌కు భారీ జరిమానా
X

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ యాపిల్‌కు ఆ దేశంలోని కోర్టు భారీ జరిమానా విధించింది. 10 ఏళ్ల క్రితం పేటెంట్ హక్కుల విషయంలో విర్‌నెట్ఎక్స్ కార్ప్ అనే సంస్థ యాపిల్‌పై న్యాయపోరాటానికి దిగింది. వాదోపవాదాలు విన్న కోర్టు సుదీర్ఘ విచారణ అనంతరం 502.8 మిలియన్ డాలర్లు (దాదాపు 37 వేల కోట్ల రూపాయలు) పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది.

విర్‌నెట్ఎక్స్ కార్ప్ అనే సంస్థ అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం ఒక కొత్త సాంకేతికతను అభివృద్ది చేసింది. ఈ సాంకేతికతను యాపిల్ తమ ఉత్పత్తుల్లో ఉండే ‘వీపీఎన్ ఆన్ డిమాండ్’, ‘ఫేస్‌టైమ్’ అనే ఫీచర్లలో వినియోగించుకుంటున్నదని సదరు సంస్థ ఆరోపిస్తున్నది. అయితే తమ ప్రొడక్ట్స్‌లో ఏనాడూ విర్‌నెట్ఎక్స్ సంస్థ సాంకేతికతను వినియోగించుకోలేదని యాపిల్ వాదించింది.

చివరకు విర్‌నెట్ఎక్స్ వాదనను కోర్టు అంగీకరించి యాపిల్‌కు భారీ జరిమానా విధించింది.

First Published:  31 Oct 2020 10:21 PM GMT
Next Story