Telugu Global
Cinema & Entertainment

కొత్త నాని కనిపించబోతున్నాడు...

నాని కొత్త సినిమా చేతులుమారిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ఎక్కువవుతుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. నాని మార్కెట్ కు అంత బడ్జెట్ పెట్టలేమని చెప్పేసింది. దీంతో నాని ఆ ప్రాజెక్టును నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ కు అప్పగించాడు. ఇదిలా ఉండగా, నాని చేయబోయే ఈ శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టుకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ లో నాని కనిపిస్తాడట. […]

కొత్త నాని కనిపించబోతున్నాడు...
X

నాని కొత్త సినిమా చేతులుమారిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ఎక్కువవుతుందని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. నాని మార్కెట్ కు అంత బడ్జెట్ పెట్టలేమని చెప్పేసింది. దీంతో నాని ఆ ప్రాజెక్టును నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ కు అప్పగించాడు. ఇదిలా ఉండగా, నాని చేయబోయే ఈ శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టుకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ లో నాని కనిపిస్తాడట. ఈ మేరకు లుక్ టెస్టులు కూడా స్టార్ట్ చేశారని సమాచారం. కమల్ హాసన్, విక్రమ్, సూర్య లాంటి నటులు తమ సినిమాల్లో కొత్త గెటప్స్ ప్రయత్నిస్తుంటారు. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా శ్యామ్ సింగరాయ్ లో నాని ఓ కొత్త లుక్ లో కనిపిస్తాడట.

మేకోవర్స్ కు నాని చాలా దూరం. ఎన్ని హిట్లు కొట్టినా, ఎన్ని ఫ్లాపులొచ్చినా ఆ సినిమాల్లో నాని లుక్ దాదాపు ఒకేలా ఉంటుంది. ఈ సహజ నటుడు కొత్త లుక్స్ ట్రై చేస్తే చూడాలని చాలామంది టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. డిసెంబర్ నుంచి శ్యామ్ సింగరాయ్ సెట్స్ పైకి వస్తుంది.

Next Story