Telugu Global
National

‘ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే మాట్లాడండి’ !

ఢిల్లీలోని ఐఎల్ బిఎస్ (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ ) హాస్పటల్ లో వైద్యులు, ఇతర సిబ్బంది తమ ప్రాంతీయ భాషల్లో మాట్లాడకూడదని ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే మాట్లాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. పేషంట్లకు వైద్యం, సంరక్షణ నిర్వహించే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే మాట్లాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. జులైలో ఈ సంస్థలోనే మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకుని ప్రారంభించారు. అక్కడి […]

‘ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే మాట్లాడండి’ !
X

ఢిల్లీలోని ఐఎల్ బిఎస్ (ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ ) హాస్పటల్ లో వైద్యులు, ఇతర సిబ్బంది తమ ప్రాంతీయ భాషల్లో మాట్లాడకూడదని ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే మాట్లాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది.

పేషంట్లకు వైద్యం, సంరక్షణ నిర్వహించే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే మాట్లాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. జులైలో ఈ సంస్థలోనే మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకుని ప్రారంభించారు.

అక్కడి సిబ్బంది తమ గురించి, తాము తీసుకుని వస్తున్న పేషంట్లను గురించి వారి సొంత భాషలో… అవమానకరంగా, హాస్యాస్పదంగా మాట్లాడుకుంటున్నారని… కొంతమంది ఫిర్యాదు చేయటంతో ప్రభుత్వం భాషలకు సంబంధించిన ఈ నిర్ణయం తీసుకుంది. ఐఎల్ బిఎస్ సంస్థ ప్రాంగణంలో ఎవరూ తమ మతపరమైన ప్రార్థనలు, పూజలు చేయరాదని కూడా ఈ నిబంధనలో ఉంది.

ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చేవారి మానసిక స్థితి సున్నితంగా ఉంటుందని, అందుకే పేషంట్లు, వారితో పాటు వచ్చే ఆప్తుల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐఎల్ బిఎస్ ఆపరేషన్స్, మెడికల్ డిప్యూటీ హెడ్ డాక్టర్ దీపక్ కుమార్ బద్వాల్ అన్నారు.

అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చేవారు… నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తమ ముందు తమకు తెలియని భాషలో మాట్లాడుకోవటం భరించలేరని, అలాంటప్పుడు పేషంటు కానీ, వారితో వచ్చే బంధువులు కానీ… హాస్పటల్ సిబ్బంది తమ గురించే తమకు తెలియని భాషలో మాట్లాడుకుంటున్నారని భావించే అవకాశం ఎక్కువగా ఉంటుందని బద్వాల్ పేర్కొన్నారు.

తాము అన్నిమతాలను గౌరవిస్తామని… అయితే మతపరమైన కార్యక్రమాలు నిర్వహించిప్పుడు ఎక్కువమంది గుమిగూడే అవకాశం ఉంటుంది కనుక వాటిని సైతం నిషేధించామని ఆయన తెలిపారు. పేషంటు తాలూకూ కుటుంబ సభ్యులు హాస్పటల్ ప్రాంగణంలో ఏదోఒక మూల గుమిగూడి పూజలు, ఆరాధనలు లాంటివి చేస్తున్నారని, దీనివలన ఇతరులకు ఇబ్బందిగా ఉంటుందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. పేషంట్ల తాలూకూ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని బద్వాల్ అన్నారు.

First Published:  26 Oct 2020 9:05 PM GMT
Next Story