Telugu Global
Cinema & Entertainment

13వేల అడుగుల ఎత్తులో నాగార్జున

నాగార్జున 13వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. అక్కడ్నుంచి తన ఫ్యాన్స్ తో మాట్లాడాడు. తన ఆనందాన్ని పంచుకున్నాడు. అవును.. తన కొత్త సినిమా షూట్ కోసం మనాలీ వెళ్లాడు నాగార్జున. ఆ ప్రాంతంలో అత్యంత ఎత్తైన రోహ్‌తంగ్ క‌నుమకు చేరుకున్నాడు. 7 నెలల గ్యాప్ తర్వాత ఇలా బయటకు రావడం, ఇలాంటి అందమైన ప్రదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు నాగ్. #WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E — Nagarjuna Akkineni (@iamnagarjuna) October […]

13వేల అడుగుల ఎత్తులో నాగార్జున
X

నాగార్జున 13వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. అక్కడ్నుంచి తన ఫ్యాన్స్ తో మాట్లాడాడు. తన ఆనందాన్ని పంచుకున్నాడు. అవును.. తన కొత్త సినిమా షూట్ కోసం మనాలీ వెళ్లాడు నాగార్జున. ఆ ప్రాంతంలో అత్యంత ఎత్తైన రోహ్‌తంగ్ క‌నుమకు చేరుకున్నాడు. 7 నెలల గ్యాప్ తర్వాత ఇలా బయటకు రావడం, ఇలాంటి అందమైన ప్రదేశానికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు నాగ్.

“హాయ్‌.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ క‌నుమ‌)లోని అంద‌మైన ఉద‌యం. స‌ముద్ర మ‌ట్టానికి మూడు వేల తొమ్మిది వంద‌ల ఎన‌భై మీట‌ర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే ప‌ద‌మూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన క‌నుమ‌. న‌వంబ‌ర్ నుంచి మే నెల వ‌ర‌కు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాం. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జ‌రుగుతోంది. అంద‌మైన ప‌ర్వ‌తాలు, నీలాకాశం, జ‌ల‌పాతాలు.. ఇక్క‌డ ఉండ‌టం ఎంతో బాగుంది. ఏడు నెలల‌ త‌ర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది.”

ఇలా తన ఆనందాన్ని బయటపెట్టిన నాగార్జున తన కొత్త సినిమా అప్ డేట్ కూడా ఇచ్చాడు. మరో 3 వారాల్లో వైల్డ్ డాగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని ప్రకటించాడు.

First Published:  24 Oct 2020 2:02 AM GMT
Next Story