Telugu Global
National

అమరావతిలో టీడీపీ నేతల దౌర్జన్యం... మందడం వెళ్తున్న మహిళలపై దాడికి యత్నం

అమరావతిలో అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు పోటాపోటీగా నడుస్తున్నాయి. వికేంద్రీకరణ ఉద్యమం కూడా ఊపందుకుంటోంది. వెనుకబడిన వర్గాల వారు మూడు రాజధానులకు అనుకూలంగా, రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌ తో 24 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. బహుజన పరిరక్షణ సమితి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ మంగళగిరి నుంచి కొందరు మహిళలు… […]

అమరావతిలో టీడీపీ నేతల దౌర్జన్యం... మందడం వెళ్తున్న మహిళలపై దాడికి యత్నం
X

అమరావతిలో అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు పోటాపోటీగా నడుస్తున్నాయి. వికేంద్రీకరణ ఉద్యమం కూడా ఊపందుకుంటోంది. వెనుకబడిన వర్గాల వారు మూడు రాజధానులకు అనుకూలంగా, రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌ తో 24 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. బహుజన పరిరక్షణ సమితి, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

శుక్రవారం కృష్ణాయపాలెం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ మంగళగిరి నుంచి కొందరు మహిళలు… మందడంలో వికేంద్రీకరణకు అనుకూలంగా జరుగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు బయలు దేరారు. వారిని కృష్ణాయపాలెం వద్దకు రాగానే కొందరు యువకులు ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఇతర గ్రామస్తులకు ఏం పని అంటూ, వెళ్లడానికి వీల్లేదని యువకులు తమను అడ్డుకున్నారని మహిళలు మీడియా ముందు చెప్పారు.

మహిళలను పచ్చిబూతులు తిట్టారు యువకులు. దాంతో మహిళలు రోడ్డుపైనే బైఠాయించారు. రాజధాని ప్రాంతానికి తామెందుకు వెళ్లకూడదు అని వారు ప్రశ్నించారు. వెనక్కు వెళ్లకపోతే ట్రాక్టర్లతో తొక్కిస్తామన్నారు, కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారని మహిళలు చెబుతున్నారు. నోటికొచ్చినట్టు తిట్టారని… అసలు రాజధాని గ్రామాల్లో మీకెందుకు స్థలాలు ఇవ్వాలని ప్రశ్నించారని మహిళలు ఆరోపించారు.

పక్క గ్రామాలకు చెందిన తమకే రాజధానిలో చోటు లేదు అంటున్నప్పుడు… అది రాష్ట్ర రాజధాని ఎలా అవుతుందని కూడా కొందరు మహిళలు మీడియా ముందు ప్రశ్నించారు. తమపై దాడిచేసేందుకు వచ్చిన వారు టీడీపీ సానుభూతిపరులు అని వారు ఆరోపిస్తున్నారు.

First Published:  23 Oct 2020 4:51 AM GMT
Next Story