Telugu Global
Cinema & Entertainment

మోసగాళ్లతో కలిసిన వెంకటేష్

హీరో విక్టరీ వెంకటేష్ “మోసగాళ్ల”తో కలిశాడు. మంచు విష్ణు, కాజల్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమా కోసం వెంకటేశ్ తన గొంతు ఇచ్చాడు. ఈ సినిమాలో కీలకమైన వాయిస్ ఓవర్ ను వెంకీతో చెప్పించారు. అతిపెద్ద స్కామ్ కు సంబంధించిన కీలకమైన విషయాల్ని వెంకీ వాయిస్ ఓవర్ తోనే చెప్పించబోతున్నారు. నిజానికి 7 నెలలుగా వెంకటేష్ బయటకు రావడం లేదు. కరోనాతో ఆయన తను చేస్తున్న సినిమాల్ని కూడా పక్కనపెట్టేశాడు. మధ్యలో రానా పెళ్లి టైమ్ […]

మోసగాళ్లతో కలిసిన వెంకటేష్
X

హీరో విక్టరీ వెంకటేష్ “మోసగాళ్ల”తో కలిశాడు. మంచు విష్ణు, కాజల్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమా కోసం వెంకటేశ్ తన గొంతు ఇచ్చాడు. ఈ సినిమాలో కీలకమైన వాయిస్ ఓవర్ ను వెంకీతో చెప్పించారు. అతిపెద్ద స్కామ్ కు సంబంధించిన కీలకమైన విషయాల్ని వెంకీ వాయిస్ ఓవర్ తోనే చెప్పించబోతున్నారు.

నిజానికి 7 నెలలుగా వెంకటేష్ బయటకు రావడం లేదు. కరోనాతో ఆయన తను చేస్తున్న సినిమాల్ని కూడా పక్కనపెట్టేశాడు. మధ్యలో రానా పెళ్లి టైమ్ లో మాత్రం తళుక్కున మెరిశాడు. అలాంటి వెంకటేష్ ను బయటకు తీసుకొచ్చి, తన సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పించుకున్నాడు మంచు విష్ణు.

మోసగాళ్లు సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు విష్ణు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఓటీటీకి కూడా ఇవ్వడం లేదు. సినిమాలో మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తోంది కాజల్.

First Published:  17 Oct 2020 2:59 AM IST
Next Story