Telugu Global
Health & Life Style

కరోనాని జయించేశామా..? వ్యాక్సిన్ అక్కర్లేదా..?

జనాల్లో కరోనా భయం తొలగిపోయి మాస్క్ లు లేకుండానే తిరిగేస్తున్న రోజులివి. రాను రాను.. మాల్స్, థియేటర్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రభుత్వమే గేట్లు ఎత్తేస్తుండటంతో.. ప్రజల్లో కూడా భయం తొలగిపోతోంది. కరోనాతో బాధపడ్డవారు, ఆ బాధను దగ్గరుండి చూసినవారు, సన్నిహితుల్ని కోల్పోయినవారు… ఇలా కరోనా ప్రభావానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గురైన అతికొద్ది మందిని మాత్రం ఇంకా ఆభయం వెంటాడుతోంది. వారు మాత్రమే మాస్క్ సహా ఇతర జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక లాక్ […]

కరోనాని జయించేశామా..? వ్యాక్సిన్ అక్కర్లేదా..?
X

జనాల్లో కరోనా భయం తొలగిపోయి మాస్క్ లు లేకుండానే తిరిగేస్తున్న రోజులివి. రాను రాను.. మాల్స్, థియేటర్లు, ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రభుత్వమే గేట్లు ఎత్తేస్తుండటంతో.. ప్రజల్లో కూడా భయం తొలగిపోతోంది.

కరోనాతో బాధపడ్డవారు, ఆ బాధను దగ్గరుండి చూసినవారు, సన్నిహితుల్ని కోల్పోయినవారు… ఇలా కరోనా ప్రభావానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా గురైన అతికొద్ది మందిని మాత్రం ఇంకా ఆభయం వెంటాడుతోంది. వారు మాత్రమే మాస్క్ సహా ఇతర జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఇక లాక్ డౌన్ టైమ్ లో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, వ్యాక్సిన్ తయారీ ఎంతవరకు వచ్చింది అనే విశేషాలకోసం విపరీతంగా ఆన్ లైన్లో వెదికిన వారంతా… ఇప్పుడు దగ్గర్లోని ఏ సినిమా థియేటర్ ఓపెన్ అయింది, షాపింగ్ మాల్స్ టైమింగ్ ఏంటి..? అని ఆలోచిస్తున్నారు. ఒకరకంగా జనాల్లో కరోనా వ్యాక్సిన్ పై ఉన్న క్యూరియాసిటీ పూర్తిగా తగ్గిపోయింది. అసలు ఆ ఆలోచనే లేదంటే అతిశయోక్తి కాదు.

ఒకవేళ రేపు కరోనా వ్యాక్సిన్ వచ్చినా కూడా ఎంతమంది దాన్ని వినియోగించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా అనుమానమే. ఎందుకంటే.. సగటు భారతీయుడికి కరోనాను జయించేశామన్న నమ్మకం రోజు రోజుకీ పెరిగిపోతోంది. తగ్గుతున్న కేసులు, పెరుగుతున్న రికవరీలు దీనికి సంకేతంగా మారాయి.

ఒకరకంగా చెప్పాలంటే.. గతంలో వచ్చిన పలు వ్యాధులు టీకా కనిపెట్టకముందే మాయమైపోయినట్టు.. కరోనా కూడా టీకా కనిపెట్టేలోపు పరారైపోయిందని అనుకోవాల్సిందే అనే అనుమానం కలుగుతోంది.

ఈ నేపధ్యంలో టీకా తయారీ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి ఉందనే మాట మాత్రం వాస్తవం. ఇప్పటికే.. టీకా తయారీకోసం వారు వెచ్చించిన డబ్బులు రేపు టీకా విడుదల తర్వాత వెనక్కి వస్తాయా లేదా అనేది అనుమానమే. పరిశోధనలు, ప్రయోగాలపై ఖర్చు చేసిన సొమ్ము తిరిగి రావాలంటే.. కచ్చితంగా అందరూ టీకా వేసుకోవాలి. కనీసం ప్రభుత్వాలయినా ప్రజలకు రాయితీపై అందించడానికి ముందుకొచ్చి, కంపెనీలకు సాయం చేయాలి. అదే జరక్కపోతే జనాల్లో ఇప్పుడున్న కనీస ఆసక్తి కూడా రేపు ఉండకపోవచ్చు. అందులోనూ టీకాలు వచ్చేది వచ్చే ఏడాదేనంటున్నారు.

ఇప్పటికే జనాల్లో కరోనా అంటే భయం పోయింది. వచ్చే ఏడాదికి అసలు కరోనా అంటే ఏంటి అనే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఓవైపు జరుగుతున్నా.. టీకాపై జనాల్లో ఆసక్తి తగ్గిందనేమాట మాత్రం వాస్తవం.

First Published:  15 Oct 2020 7:20 PM GMT
Next Story