Telugu Global
CRIME

జైలులో కీసర మాజీ తహసీల్దార్‌ ఆత్మహత్య

లంచం కేసులో అరెస్ట్‌ అయిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. చంచల్‌గూడలో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఓ భూవివాదాన్ని పరిష్కరించేందుకు రెండు కోట్లు లంచం డిమాండ్ చేసి… ఇప్పటికే కోటి 10 లక్షలు తీసుకున్నందుకు గాను ఇటీవల ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసింది. భూవివాదంలో ఎన్‌వోసీ ఇచ్చేందుకు లంచం తీసుకున్నారు. నెల రోజులుగా ఈ కేసుపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. నాగరాజుపై 2011లోనూ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు అయింది. […]

జైలులో కీసర మాజీ తహసీల్దార్‌ ఆత్మహత్య
X

లంచం కేసులో అరెస్ట్‌ అయిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. చంచల్‌గూడలో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నారు.

ఓ భూవివాదాన్ని పరిష్కరించేందుకు రెండు కోట్లు లంచం డిమాండ్ చేసి… ఇప్పటికే కోటి 10 లక్షలు తీసుకున్నందుకు గాను ఇటీవల ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేసింది. భూవివాదంలో ఎన్‌వోసీ ఇచ్చేందుకు లంచం తీసుకున్నారు. నెల రోజులుగా ఈ కేసుపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

నాగరాజుపై 2011లోనూ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు అయింది. అప్పట్లోనూ నాగరాజుకు సంబంధించిన భారీ అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆ కేసు నుంచి కొన్ని నెలల క్రితమే ఆయనకు విముక్తి లభించింది. రాజకీయ నాయకుల అండదండల వల్లే అది సాధ్యమైందన్న విమర్శలు వచ్చాయి.

First Published:  13 Oct 2020 9:48 PM GMT
Next Story