Telugu Global
International

పదహారేళ్ల అమ్మాయి... ఫిన్లాండ్ ప్రధానిగా...!

పర్యావరణం, మానవహక్కులపై పోరాడుతున్న ఓ బాలికకు ఫిన్లాండ్ దేశానికి ప్రధానిగా ఒక రోజు వ్యవహరించే అవకాశం లభించింది. లింగ వివక్షని రూపు మాపాలని ప్రధాని సన్నా మారిన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అవా ముర్టో అనే అమ్మాయి బుధవారం ఫిన్లాండ్ ప్రధానిగా మారిపోయింది. ఆ హోదాలో ఆమె రాజకీయ నాయకులను కలిసి టెక్నాలజీ రంగంలో మహిళల హక్కులను గురించి మాట్లాడింది. మానవతావాదంలో కృషి చేస్తున్న ప్లాన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ‘గర్ల్స్ టేకోవర్’ అనే ప్రచార కార్యక్రమాన్ని […]

పదహారేళ్ల అమ్మాయి... ఫిన్లాండ్ ప్రధానిగా...!
X

పర్యావరణం, మానవహక్కులపై పోరాడుతున్న ఓ బాలికకు ఫిన్లాండ్ దేశానికి ప్రధానిగా ఒక రోజు వ్యవహరించే అవకాశం లభించింది. లింగ వివక్షని రూపు మాపాలని ప్రధాని సన్నా మారిన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అవా ముర్టో అనే అమ్మాయి బుధవారం ఫిన్లాండ్ ప్రధానిగా మారిపోయింది. ఆ హోదాలో ఆమె రాజకీయ నాయకులను కలిసి టెక్నాలజీ రంగంలో మహిళల హక్కులను గురించి మాట్లాడింది.

మానవతావాదంలో కృషి చేస్తున్న ప్లాన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ‘గర్ల్స్ టేకోవర్’ అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ఫిన్లాండ్ వరుసగా నాల్గవ సంవత్సరం పాలుపంచుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళల ప్రగతికోసం పనిచేస్తున్న యువతలో ఎవరో ఒకరికి ఒక రోజు దేశాధినేతగా మారే అవకాశం కల్పిస్తారు. ఏటా ఏదో అంశంపై ప్రచారం ఉంటుంది. ఈ ఏడాది ‘గర్ల్స్ టేకోవర్’ లో ఆడపిల్లలకు డిజిటల్ నైపుణ్యాలు, టెక్నాలజీ అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కెన్యా, పెరు, సుడాన్, వియత్నాం దేశాలు సైతం ‘గర్ల్స్ టేకోవర్’ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నాయి.

ఫిన్లాండ్ లో ఒక రోజు ప్రధానిగా మారిన అవా ముర్టో… రాజకీయ నేతలు పాల్గొన్న సభలో ప్రసంగిస్తూ ‘ మీ ముందు ఇలా మాట్లాడే అవకాశం రావటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అయితే ఇలాంటి కార్యక్రమం కోసం ఇలా మాట్లాడాలని నాకు లేదు. ‘గర్ల్స్ టేకోవర్’ లాంటి కార్యక్రమాలు అవసరం లేని రోజులు రావాల్సి ఉంది. ఈ భూమ్మీద ఏ ప్రాంతంలోనూ స్త్రీపురుష సమానత్వం లేదన్నమాట నిజం. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం విషయంలో ఇప్పటికే చాలా కృషి జరుగుతున్నప్పటికీ ఇంకా జరగాల్సి ఉంది. అమ్మాయిలను… టెక్నాలజీని వాడకుండా, ఈ రంగంలోకి కాలు పెట్టకుండా నియంత్రించినంతకాలం లింగవివక్ష రూపుమాసిపోదు. టెక్నాలజీ రంగంలో మహిళల గొంతు వినిపించాలి, ఈ రంగంలో వారికి భవిష్యత్తు ఉండాలి ’ అంటూ నేటి తరం అమ్మాయిల ప్రతినిధిగా తన గళం వినిపించింది అవా ముర్టో.

First Published:  8 Oct 2020 8:30 PM GMT
Next Story