సెట్స్ పైకొచ్చిన టక్ జగదీశ్
హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. తమ సినిమా పనుల్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో నాని కూడా సెట్స్ పైకి వచ్చాడు. తన కొత్త సినిమా పనులు షురూ చేశాడు. నిన్నట్నుంచి టక్ జగదీష్ షూటింగ్ మొదలైంది. సినిమా షూట్ కంప్లీట్ అయ్యేంతవరకు ఈ షెడ్యూల్ కొనసాగుతోంది. నానితో పాటు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయింది. సినిమాలో నానికి మరదలుగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. శివ నిర్వాణ […]

హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. తమ సినిమా పనుల్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో నాని కూడా సెట్స్ పైకి వచ్చాడు. తన కొత్త సినిమా పనులు షురూ చేశాడు. నిన్నట్నుంచి టక్ జగదీష్ షూటింగ్ మొదలైంది. సినిమా షూట్ కంప్లీట్ అయ్యేంతవరకు ఈ షెడ్యూల్ కొనసాగుతోంది.
నానితో పాటు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ అయింది. సినిమాలో నానికి మరదలుగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
టక్ జగదీష్ పూర్తయిన వెంటనే శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలనేది నాని ఆలోచన. ఎందుకంటే లాక్ డౌన్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమౌతూ వస్తోంది. పైగా ఆ సినిమాకు హీరోయిన్ సాయి పల్లవి చాలా టైట్ కాల్షీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వీలైనంత త్వరగా టక్ జగదీష్ పూర్తిచేసి, శ్యామ్ సింగరాయ్ ప్రాజెక్టు మీదకు వెళ్లాలనుకుంటున్నాడు నాని.