Telugu Global
National

డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే... రోడ్డుపై కనిపించిన సింహం

అర్థరాత్రి పూట డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే వీధి కుక్కలు వెంటపడతాయని చాలా మందికి భయం ఉంటుంది. అదే రోడ్డుపై సింహం ఎదురైతే పరిస్థితి ఏంటి? అలాంటి సంఘటనే గుజరాత్‌లో ఎదురైంది. మహాశ్ సోందర్వ అనే వ్యక్తి చాలా కాలంగా గిర్ ఫారెస్ట్‌లో బీట్ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అక్కడ అడవుల్లో సింహాలు, పులులు చాలా అరుదుగా మాత్రమే అతడు చూస్తుంటాడు. అందుకే ప్రతీ రోజు డ్యూటీ ముగించుకొని తన బైక్‌పై ఒంటరిగానే ఇంటికి వెళ్తుంటాడు. గత […]

డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే... రోడ్డుపై కనిపించిన సింహం
X

అర్థరాత్రి పూట డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే వీధి కుక్కలు వెంటపడతాయని చాలా మందికి భయం ఉంటుంది. అదే రోడ్డుపై సింహం ఎదురైతే పరిస్థితి ఏంటి? అలాంటి సంఘటనే గుజరాత్‌లో ఎదురైంది. మహాశ్ సోందర్వ అనే వ్యక్తి చాలా కాలంగా గిర్ ఫారెస్ట్‌లో బీట్ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అక్కడ అడవుల్లో సింహాలు, పులులు చాలా అరుదుగా మాత్రమే అతడు చూస్తుంటాడు. అందుకే ప్రతీ రోజు డ్యూటీ ముగించుకొని తన బైక్‌పై ఒంటరిగానే ఇంటికి వెళ్తుంటాడు.

గత వారం ఇలాగే రాత్రి పూట విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా నడి రోడ్డుపై ఒక సింహం కూర్చొని ఉంది. దాన్ని చూడగానే మహేశ్ గుండె జారిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి.. నడి రోడ్డుపై సింహం.. ఏం చేయాలో పాలుపోలేదు. ‘ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి వెళ్లనివ్వు. ఉదయం నుంచి ఇక్కడ డ్యూటీ చేసి అలసిపోయి ఇంటికి వెళ్తున్నాను.’ అంటూ గుజరాతీ భాషలో వేడుకుంటూ వీడియో తీశాడు.

పాపం మహేశ్ చెప్పిందే వినపడిందో లేదా ఇంకేమనుకుందో కానీ ఆ సింహం నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయింది. బతుకు జీవుడా అనుకుంటూ మహేశ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.

ఈ వీడియోను గిర్ ఈస్ట్ ఫారెస్ట్ డిప్యుటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ధైర్యవంతుడైన మా సిబ్బంది వేడుకోగానే ఆ సింహం అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

First Published:  6 Oct 2020 8:05 AM GMT
Next Story