ట్రంప్‌కు కరోనా పాజిటివ్... క్వారంటైన్‌లో ప్రెసిడెంట్
అమెరికా అధ్యక్ష భవనంలో కరోనా కలకలం రేగింది. ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు, సలహాదారి అయిన హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ట్రంప్ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది. ఆయనతో పాటు భార్య మెలానియాకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారైంది. ఓవైపు కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇంకో వైపు అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది. ట్రంప్ తీరిక లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ మొదలైంది. ఇలాంటి టైమ్‌లో ట్రంప్ కీలక […]

అమెరికా అధ్యక్ష భవనంలో కరోనా కలకలం రేగింది. ట్రంప్‌కు అత్యంత సన్నిహితురాలు, సలహాదారి అయిన హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ట్రంప్ కూడా కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది. ఆయనతో పాటు భార్య మెలానియాకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారైంది.
ఓవైపు కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇంకో వైపు అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది. ట్రంప్ తీరిక లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్ మొదలైంది. ఇలాంటి టైమ్‌లో ట్రంప్ కీలక సలహాదారు హోప్ హిక్స్‌కు కరోనా రావడంతో వైట్‌హౌస్‌లో కలకలం రేగింది. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా కరోనా టెస్ట్‌లు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది.
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌తో కలిసి హోప్ హిక్స్ పలుసార్లు ప్రయాణించారు. రెండు రోజుల కిందట కూడా ట్రంప్‌తో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ట్రంప్‌కు క్లోజ్‌గా ఉండే సలహాదారుకు కరోనా రావడంతో అధ్యక్ష భవనంలో అలజడి మొదలైంది. దీంతో వెంటనే అధ్యక్షుడితో పాటు ఆయన సిబ్బందికి పరీక్షలు నిర్వహించడంతో… ట్రంప్‌కు పాజిటివ్ గా తేలింది.
హోప్ హిక్స్ గతంలో వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రతినిధిగా పనిచేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆమె తిరిగి వైట్ హౌస్ కు వచ్చారు.