అరవై రోజుల వరకు కోవిడ్ యాంటీ బాడీలు !
ఒకసారి కోవిడ్ 19 వచ్చి తగ్గిన వారి శరీరంలో… దానిపై పోరాడిన యాంటీ బాడీలు ఎన్నిరోజుల పాటు స్థిరంగా ఉంటాయి…. అనే సందేహం మనలో ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం న్యూఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, ఇంకా జన్యువులకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించే సిఎస్ఐఆర్-ఇన్ స్టిట్యూట్ ఫర్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ కలిసి సంయుక్తంగా అయిదునెలల పాటు అధ్యయనం నిర్వహించాయి. ఒకసారి శరీరంలో చేరిన యాంటీ బాడీలు అరవై రోజులకు పైగా కోవిడ్ […]
ఒకసారి కోవిడ్ 19 వచ్చి తగ్గిన వారి శరీరంలో… దానిపై పోరాడిన యాంటీ బాడీలు ఎన్నిరోజుల పాటు స్థిరంగా ఉంటాయి…. అనే సందేహం మనలో ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం న్యూఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, ఇంకా జన్యువులకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించే సిఎస్ఐఆర్-ఇన్ స్టిట్యూట్ ఫర్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ కలిసి సంయుక్తంగా అయిదునెలల పాటు అధ్యయనం నిర్వహించాయి.
ఒకసారి శరీరంలో చేరిన యాంటీ బాడీలు అరవై రోజులకు పైగా కోవిడ్ 19 నుండి రక్షణను కలిగిస్తాయని ఈ అధ్యయనంలో తేలింది. మెడ్ ఆరెక్సివ్ జర్నల్ లో ఈ వివరాలు ప్రచురించారు. అయితే అంతకుముందు ఇదే విషయంపై నిర్వహించిన పరిశోధన… కోవిడ్ యాంటీబాడీలు అది వచ్చి తగ్గినవారి శరీరంలో యాభై కంటే తక్కువ రోజులు ఉంటాయని పేర్కొంది.
ప్రస్తుత అధ్యయనం కోసం ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మొత్తం 780మంది కరోనా పేషంట్ల ఆరోగ్య స్థితులను అధ్యయనం చేశారు. ఇందులో 448 మంది హెల్త్ వర్కర్లు కాగా 332 మంది ఇతర వ్యక్తులు. ఒకసారి కరోనాపై పోరాటం కోసం విడుదలైన యాంటీబాడీలు 60 రోజులకు పైగానే శరీరంలో ఉంటాయని వెల్లడించే మొట్టమొదటి వైద్య నివేదిక ఇదేనని… ఎండోక్రినాలజీ, డయాబెటిస్ మెటబాలిజం విభాగాల ప్రిన్సిపల్ డైరక్టర్ డాక్టర్ సుజీత్ ఝా అన్నారు.
కోవిడ్ పాజిటివ్ వ్యక్తులపై అధ్యయనం ఇంకా కొనసాగిస్తున్నామని… ఇకముందు వచ్చే ఫలితాలతో కోవిడ్ వైరస్ పై పోరాడేందుకు రోగనిరోధక వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుస్తుందని, వ్యాక్సిన్ తయారీలో ఈ ఫలితాలు ఉపయోగపడతాయని డాక్టర్ సుజీత్ అన్నారు.
కరోనాకి గురయినవారిలో యాభైశాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన పేషంట్లలో 19మందిలో యాంటీబాడీలు నలభై రోజులు స్థిరంగా ఉండగా 12 మందిలో 50 రోజుల వరకు ఉన్నాయి. నలుగురిలో అరవై రోజులకు పైగా యాంటీ బాడీలు స్థిరంగా ఉన్నాయని సిఎస్ఐఆర్-ఇన్ స్టిట్యూట్ ఫర్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ లో పిహెచ్ డి స్కాలర్ అయిన సల్వా నౌషిన్ అన్నారు.