Telugu Global
Health & Life Style

మనం... మన మాస్క్ ధారణ !

‘బయటకు వెళితే మాస్కు తప్పనిసరి…’ ఇది అందరూ ఒప్పుకుంటున్న విషయమే. అయితే మనుషుల ఆలోచనలు అలవాట్లు ధోరణులు విభిన్నంగా ఉంటున్నట్టుగానే మాస్కులు ధరించే విధానం కూడా రకరకాలుగా ఉంటోంది. ఇదే విషయాన్ని తెలియజేసే ఓ చిత్రాన్ని… బాలీవుడ్ నటుడు, నటి జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.    కోవిడ్ పర్సనాలిటీ టైప్స్ అంటూ…   మాస్కులు ధరించే వ్యక్తులను ప్రతిబింబించేలా నాలుగు మొహాలున్న ఆ చిత్రం… హాస్యం ఉట్టిపడుతూనే ప్రస్తుతం సమాజంలో […]

మనం... మన మాస్క్ ధారణ !
X

‘బయటకు వెళితే మాస్కు తప్పనిసరి…’ ఇది అందరూ ఒప్పుకుంటున్న విషయమే. అయితే మనుషుల ఆలోచనలు అలవాట్లు ధోరణులు విభిన్నంగా ఉంటున్నట్టుగానే మాస్కులు ధరించే విధానం కూడా రకరకాలుగా ఉంటోంది. ఇదే విషయాన్ని తెలియజేసే ఓ చిత్రాన్ని… బాలీవుడ్ నటుడు, నటి జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కోవిడ్ పర్సనాలిటీ టైప్స్ అంటూ… మాస్కులు ధరించే వ్యక్తులను ప్రతిబింబించేలా నాలుగు మొహాలున్న ఆ చిత్రం… హాస్యం ఉట్టిపడుతూనే ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితిని చెబుతోంది.

ఆ చిత్రంలోని ఓ ముఖ ఆకారం… ముక్కు, నోరు అంతా కవర్ అయ్యేలా సవ్యంగా మాస్క్ ధరించి ఉంది. దానికి ‘సైన్స్ పట్ల నమ్మకం’ అనే క్యాప్షన్ ఉంది. మరొక ముఖ ఆకారం… అసలు మాస్కే లేకుండా ఉంది. దానికి ‘సైన్స్ పట్ల వ్యతిరేకత’ అనే మాటని జోడించారు. ఇక మూడవ రకం… సైన్స్ అర్థం కానివారు… ఈ ముఖ ఆకారంలో మాస్క్ ఉంది… కానీ అది ముక్కుని వదిలేసి నోటిపైన మాత్రమే ఉంది. నాలుగవ రకం ముఖంలో మాస్క్ ముక్కుమీద లేదు, నోటిమీద లేదు… అది గడ్డం కింద ఉంది. దీని క్యాప్షన్… ‘మ్యాజిక్ జరుగుతుందని నమ్మేవారు’.

రితేష్ చేసిన ఈ పోస్ట్ వైరల్ కాగా… పలువురు నెటిజన్లు మరిన్ని హాస్యజనితమైన కామెంట్లు పెడుతున్నారు. మాస్క్ ఆకారంలో మొహంపై పెయింట్ వేసుకున్న వ్యక్తి ఫొటోని పోస్ట్ చేసి… దానికి ‘సైన్స్ కి అతీతమైన నమ్మకాలున్న వ్యక్తి’ అనే కామెంట్ పెట్టారు ఒకరు. అలాగే దుపట్టాతో ముక్కుని నోటిని మూసుకున్న మహిళ చిత్రం పెట్టి…‘ సంప్రదాయం పట్ల నమ్మకం’ అంటూ కామెంట్ చేశారు మరొకరు. రితేష్ పోస్ట్ చేసిన చిత్రంలో లాగే… ఇప్పటికీ మాస్క్ ని ధరించనివారు, ధరించినా దానిని సవ్యంగా వాడనివారు మన చుట్టూ కనబడుతున్నారు. కరోనా విషయంలో అతి పెద్ద ప్రమాదాన్ని నివారించే అతితేలిక మార్గం మాస్క్…. అనే అవగాహన మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది.

First Published:  19 Sep 2020 3:06 AM GMT
Next Story