Telugu Global
CRIME

ఆ రాత్రివేళ... సజ్జనార్ స్పందించకపోతే...!

చట్టం సకాలంలో స్పందిస్తే… అన్యాయాలను అక్రమాలను సమర్ధవంతంగా అరికట్టవచ్చు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమని…సైబరాబాద్ సిపి వి సి సజ్జనార్ కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆయన సకాలంలో సత్వరంగా స్పందించి ఒక మైనర్ బాలిక జీవితం దుర్మార్గుల బారిన పడకుండా కాపాడగలిగారు. ప్రముఖ సంఘ సేవకురాలు, ప్రజ్వల సేవాసంస్థ నిర్వాహకురాలు  సునీత కృష్ణన్ ఈ వివరాలను తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ‘ఆపదలో ఉన్నాం రక్షించండి’… అనే సందేశం […]

ఆ రాత్రివేళ... సజ్జనార్ స్పందించకపోతే...!
X

చట్టం సకాలంలో స్పందిస్తే… అన్యాయాలను అక్రమాలను సమర్ధవంతంగా అరికట్టవచ్చు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమని…సైబరాబాద్ సిపి వి సి సజ్జనార్ కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆయన సకాలంలో సత్వరంగా స్పందించి ఒక మైనర్ బాలిక జీవితం దుర్మార్గుల బారిన పడకుండా కాపాడగలిగారు. ప్రముఖ సంఘ సేవకురాలు, ప్రజ్వల సేవాసంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ ఈ వివరాలను తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ‘ఆపదలో ఉన్నాం రక్షించండి’… అనే సందేశం అందించే ఎస్ ఓ ఎస్ కాల్ ఒకటి బంగ్లాదేశ్ నుండి తనకు వచ్చిందని, బంగ్లాదేశ్ కు చెందిన ఒక మైనర్ బాలికని హైదరాబాద్ కి అక్రమ రవాణా చేస్తున్నట్టుగా ఆ కాల్ ద్వారా తనకు తెలిసిందని సునీత తెలిపారు. తాను వెంటనే సైబరాబాద్ సిపి సజ్జనార్ కి ఈ విషయం తెలియజేశానని… ఆ తరువాత 45 నిముషాలపాటు… కార్ ఛేజ్ లు, ఆడియో మెసేజ్ లు, లొకేషన్ ట్రాకింగులు….వగైరాలతో… ఒక్క నిముషం కూడా వృథా కాకుండా పోలీసులు అత్యంత వేగంగా పనిచేయటంతో… సరిగ్గా గం.10.25ని.లకు ఆ బాలికని కనిపెట్టగలిగారని ఆమె వెల్లడించారు.

సజ్జనార్, ఆయన టీమ్ సకాలంలో, అంత త్వరగా స్పందించకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదని… సునీత అన్నారు. వారు స్పందించిన విధానాన్ని ఓ అద్భుతంగా వర్ణించారామె. వేగం…అనే మాటని ఇంకా సరిగ్గా చెప్పాలంటే సెకన్ల వ్యవధిలోనే పోలీసులు స్పందించారన్నారు. ‘థాంక్యూ సజ్జనార్ సర్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారామె.

Next Story