Telugu Global
National

ఇంట్లోంచి వెళ్లిపోయింది... ఏడేళ్ల తరువాత...!

ఆడపిల్లకు పెళ్లి చేసేస్తే చాలు… ఇక  జీవితంలో ఆమె సెటిల్ అయిపోయినట్టేనని భావించే సమాజం మనది. నిజానికి చాలామంది అమ్మాయిల విషయంలో… అప్పటివరకు స్థిరంగా ఉన్న జీవితం కాస్తా పెళ్లి తరువాత ఎన్నో ఆటుపోట్లకు గురవుతుంటుంది. అయినా సరే… అదే స్థిరత్వం… అనే భ్రమని  అమ్మాయిల్లో కలిగేలా చేస్తుంటారు చుట్టుపక్కల ఉన్నవారు. మీరట్ కి చెందిన సంజు రాణి వర్మకు ఆమె కుటుంబ సభ్యులు కూడా అలాగే చెప్పారు. 2013లో సంజు పిజి చదువుతున్నపుడు ఆమె తల్లి […]

ఇంట్లోంచి వెళ్లిపోయింది... ఏడేళ్ల తరువాత...!
X

ఆడపిల్లకు పెళ్లి చేసేస్తే చాలు… ఇక జీవితంలో ఆమె సెటిల్ అయిపోయినట్టేనని భావించే సమాజం మనది. నిజానికి చాలామంది అమ్మాయిల విషయంలో… అప్పటివరకు స్థిరంగా ఉన్న జీవితం కాస్తా పెళ్లి తరువాత ఎన్నో ఆటుపోట్లకు గురవుతుంటుంది. అయినా సరే… అదే స్థిరత్వం… అనే భ్రమని అమ్మాయిల్లో కలిగేలా చేస్తుంటారు చుట్టుపక్కల ఉన్నవారు. మీరట్ కి చెందిన సంజు రాణి వర్మకు ఆమె కుటుంబ సభ్యులు కూడా అలాగే చెప్పారు.

2013లో సంజు పిజి చదువుతున్నపుడు ఆమె తల్లి మరణించింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు అందరూ ఇక చదువు ఆపేసి పెళ్లి చేసుకోమని సంజుని ఒత్తిడి చేశారు. అయితే తన కాళ్లపై తాను నిలబడే వరకు పెళ్లివద్దనుకున్న సంజు… కుటుంబ సభ్యుల ఒత్తిడిని భరించలేక ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పటికి ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో పిజి చేస్తోంది. చదువుని కొనసాగించడం, సివిల్స్ రాయటం… ఈ ధ్యేయాలతో ఒంటరిగా జీవన పోరాటం మొదలుపెట్టింది.

చేతిలో డబ్బు లేకపోవటంతో చదువుని కొనసాగించలేకపోయింది. ఒక చిన్నగది అద్దెకు తీసుకుని పిల్లలకు ట్యూషన్లు చెప్పటం మొదలుపెట్టింది. అలాగే ప్రయివేట్ స్కూళ్లలో టీచర్ గా జాబ్ చేసేది. అలాంటి స్థితిలోనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేది. అలా తనకు తానే అండ అని భావిస్తూ… ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన ఏడేళ్లకు ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ర్యాంకుని సాధించింది. గతవారం ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు సంజు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కాబోతోంది.

జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉందంటోంది సంజు. యుపిఎస్ సి పరీక్షలు రాసి… జిల్లా మెజిస్ట్రేట్ కావటమే తన కల అంటోందామె. కుటుంబం తనకు తోడుగా నిలబడకపోయినప్పటికీ… తాను ఆర్థికంగా వారికి అండగా ఉంటానని చెబుతోంది సంజు రాణి వర్మ. కుటుంబ సభ్యులు తన వద్దకు రావాలని ఆశిస్తోంది. కష్టాలకు చలించకుండా కలలను సాకారం చేసుకోవాలనే స్ఫూర్తిని నేటితరం అమ్మాయిల్లో నింపుతున్న సంజు ఎంతో అభినందనీయురాలు.

First Published:  16 Sep 2020 8:13 AM GMT
Next Story