Telugu Global
National

ఎన్నాళ్లీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్...

వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడం, కుదరకపోతే వాటితోనే ఆడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని వరుసగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థపై తన కసి తీర్చుకుంటున్నారు. ఓవైపు శాసన నిర్ణయాలపై కూడా కోర్టుల్లో కొర్రీలు వేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్న బాబు.. మరోవైపు శాంతి భద్రతల విషయంలో కూడా వేలు పెడుతున్నారు. గతంలో పలుసందర్భాల్లో ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేలా బాధితుల్ని రెచ్చగొట్టి పంపించిన చంద్రబాబు.. […]

ఎన్నాళ్లీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్...
X

వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకోవడం, కుదరకపోతే వాటితోనే ఆడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని వరుసగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థపై తన కసి తీర్చుకుంటున్నారు.

ఓవైపు శాసన నిర్ణయాలపై కూడా కోర్టుల్లో కొర్రీలు వేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్న బాబు.. మరోవైపు శాంతి భద్రతల విషయంలో కూడా వేలు పెడుతున్నారు. గతంలో పలుసందర్భాల్లో ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేలా బాధితుల్ని రెచ్చగొట్టి పంపించిన చంద్రబాబు.. హైకోర్టుతో పోలీస్ డిపార్ట్ మెంట్ పై మొట్టికాయలు వేయించారు. ఏకంగా డీజీపీనే వెళ్లి కోర్టులో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇటీవల ఓ వెబ్ సైట్ నిర్వాహకుడిపై సీఐడీ విచారణను కూడా కోర్టు అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా కోర్టు ఖాకీస్టోక్రసీ అనే పెద్దపదం వాడింది. కోర్టు వ్యాఖ్యల్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ఎంత రచ్చచేసిందో చూశాం.

తాజాగా అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం అయ్యారని హైకోర్టులో అతని మేనమామ హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో మరోసారి హైకోర్టు డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందన్న హైకోర్టు, రూల్ ఆఫ్ లా అమలు కావడంలేదని మండిపడినట్టు సమాచారం.

పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించినట్టు వార్తలొస్తున్నాయి. ఈపాటికే దీనిపై పెడర్థాలు తీస్తూ జూమ్ లో బైటకు వస్తున్నారు టీడీపీ నేతలు.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాదనలేం. కొన్ని సందర్భాల్లో తప్పులు జరిగినప్పుడు కోర్టుల జోక్యం కూడా అవసరమవుతుంది, అదీ కాదనలేం. కానీ పదే పదే బాధితుల్ని రెచ్చగొట్టి కోర్టుల్లో కేసులు వేయిస్తూ, పోలీస్ వ్యవస్థని అభాసుపాలు చేయాలని చూడటాన్ని ఏమనాలి. అసలు పోలీసులు అధికార పార్టీ నేతలకు ఎందుకు వంత పాడాలనుకుంటారు, ప్రభుత్వం చెప్పినట్టే చేయాలని ఎందుకు అనుకుంటారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు ఆమాత్రం తెలియదా? ఆ విషయం తెలుసు కాబట్టే, అందరు పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలకరు కాబట్టే.. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ లో భారీ బదిలీలు చేశారు. తమకు అనుకూలమైనవారిని కీలక జిల్లాలకు బదిలీ చేయించుకున్నారు. అయితే వారంతా చంద్రబాబు చెప్పినట్టే తలాడించలేదు. దానికి నిదర్శనమే టీడీపీ పతనం.

అప్పుడు చంద్రబాబు మాటలు వినని ఆఫీసర్లు.. ఇప్పుడు జగన్ మాట ఎందుకు వింటారు. అధికారం కోల్పోయామన్న దుగ్ధతో కక్షసాధించడం, మోరల్ గా హింసించడానికే చంద్రబాబు ఇలాంటి కేసులు పెట్టిస్తున్నారు. పోలీసుల్ని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.

First Published:  14 Sep 2020 5:29 AM GMT
Next Story