ఎస్‌బీఐలో డైరెక్టర్ పోస్టు పేరుతో 12 కోట్లకు నూతన్ నాయుడు మోసం
పెందుర్తి శిరోముండనం కేసులో అరెస్టయిన నూతన్‌నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో 12 కోట్ల రూపాయలకు ఒక వ్యక్తిని మోసం చేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బిక్కవోలు నూకరాజు అనే వ్యక్తితో 2016లో పరిచయం ఏర్పరుచుకున్న నూతన్‌నాయుడు అతడి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సౌత్ రీజనల్ డైరెక్టర్ పోస్టు ఇప్పిస్తానంటూ 12 కోట్లను విడతల వారీగా వసూలు చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. బాధితుడు నిలదీయగా దాడి […]
పెందుర్తి శిరోముండనం కేసులో అరెస్టయిన నూతన్‌నాయుడు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో 12 కోట్ల రూపాయలకు ఒక వ్యక్తిని మోసం చేసిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
బిక్కవోలు నూకరాజు అనే వ్యక్తితో 2016లో పరిచయం ఏర్పరుచుకున్న నూతన్‌నాయుడు అతడి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సౌత్ రీజనల్ డైరెక్టర్ పోస్టు ఇప్పిస్తానంటూ 12 కోట్లను విడతల వారీగా వసూలు చేశాడు.
ఆ తర్వాత ముఖం చాటేశాడు. బాధితుడు నిలదీయగా దాడి చేశాడు. దాంతో బాధితుడు… ఈనెల 7న మహారాణిపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. నూతన్ నాయుడిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. నూతన్‌నాయుడు ఇలా చాలా మందిని మోసం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ పేరుతో చాలా మంది అధికారులను కూడా నూతన్ నాయుడు బోల్తా కొట్టించాడు.