Telugu Global
International

'కోవిడ్ ప్రాణాంతకం కాదు... కానీ అది ఎప్పటికీ మనతోనే ఉండబోతున్నది'

కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదులో ఇండియా సరికొత్త శిఖరాలను చేరుతున్నది. ప్రతీ నిత్యం వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతుండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కోవిడ్ రాబోయే కాలంలో ఎలా ప్రభావితం చేయబోతున్నది? మనం ఎప్పుడు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడతామనే విషయాలను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ స్కాలర్, సీఎంసీ వెల్లూర్ ప్రొఫెసర్ డాక్టర్ గగన్‌దీప్ కంగ్ జాతీయ మీడియాకు వివరించారు. ఆ వివరాలు క్లుప్తంగా.. కోవిడ్ అనేది సాధారణ ఫ్లూ కాదు. […]

కోవిడ్ ప్రాణాంతకం కాదు... కానీ అది ఎప్పటికీ మనతోనే ఉండబోతున్నది
X

కోవిడ్-19 పాజిటివ్ కేసుల నమోదులో ఇండియా సరికొత్త శిఖరాలను చేరుతున్నది. ప్రతీ నిత్యం వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతుండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కోవిడ్ రాబోయే కాలంలో ఎలా ప్రభావితం చేయబోతున్నది? మనం ఎప్పుడు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడతామనే విషయాలను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ స్కాలర్, సీఎంసీ వెల్లూర్ ప్రొఫెసర్ డాక్టర్ గగన్‌దీప్ కంగ్ జాతీయ మీడియాకు వివరించారు. ఆ వివరాలు క్లుప్తంగా..

  • కోవిడ్ అనేది సాధారణ ఫ్లూ కాదు. ఇది ఫ్లూ కంటే దారుణమైనది. ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. చాలా మంది తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. కొంత మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. కోవిడ్ అనేది ప్రాణాంతకమైన వైరస్ కాదు. గతంలో వచ్చిన ఎబోలా లేదా తొలి సార్స్ వైరస్‌లు మనుషుల ప్రాణాలను తీసినంతగా సార్స్ కోవ్2 ప్రభావం చూపడం లేదు. మెర్స్ వైరస్ బారిన పడిన వాళ్లలో 30 శాతం, సార్స్ 1 వైరస్ బారిన పడిన వాళ్లలో 10 శాతం మంది ప్రాణాలను కోల్పోయారు. కానీ కోవిడ్-19 బారిన పడిన వాళ్లలో చనిపోయిన వారు 1 శాతం మాత్రమే. ప్రపంచమంతా పూర్తిగా విస్తరించనిదే ఈ వైరస్ అంతం కాదు. అలా ప్రపంచవ్యాప్తం కావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అంటే మనం ఈ వైరస్‌తో పాటు ఇంకా జీవించాల్సి ఉంది. కరోనావైరస్ కూడా ఒక సీజనల్ వ్యాధిలా స్థిరపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానవ శరీరంలో ఎక్కువ కాలం ఉంటే.. ఆ వైరస్ అనేది తేలికైపోతుంది. అంతే కాకుండా వైరస్ మార్పులకు కూడా లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మిగతా వైరస్‌ల్లా కాకుండా కరోనా అనేది చాలా నెమ్మదిగా మార్పునకు గురికావడం కాస్త ఆందోళన కలిగించే విషయం.
  • గత కొన్ని నెలల నుంచి దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల పద్దతిని గమనిస్తే.. రాబోయే నెలల్లో వైరస్ ప్రభావం ఎలా ఉండబోతున్నదనే విషయం అర్థం చేసుకోవచ్చు. కరోనా కేసులకు సంబంధించిన డేటాను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మనకు ఎంత మంది కరోనా లక్షణాలు కలిగిన రోగులను ట్రేసింగ్ చేయగలిగామనే వివరాలు లేవు. ఇలాంటి కీలక వివరాలు నమోదు చేయకపోవడం వల్ల వైరస్ తిరిగి ఎప్పుడు పుంజుకుంటుంది, ఏ ప్రాంతంలో పుంజుకుంటుందనే విషయాన్ని మనం ఊహించలేము. అయితే కరోనా మరణాలన్నీ నమోదు చేయడం సంతోషించదగిన విషయం. దీని వల్ల మరణాల రేటు ఎంత ఉందో తెలుసుకోగలిగాము. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో మరణాల రేటు తక్కువగా ఉంది. మన దేశంలో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించడం వల్లే ఇది సాధ్యమయ్యింది.
  • ఇక మనం ఇప్పటికీ సగం జనాభాకు కూడా టెస్టులు నిర్వహించలేకపోయాం. ప్రతీ రోజు 10 లక్షల మందికి టెస్టులు చేస్తున్నారని చెబుతున్నా.. పూర్తి స్థాయిలో జరగడం లేదనేది వాస్తవం. ఒక వ్యక్తి ఏడాదంతా నెగెటివ్‌గా ఉన్నాడా అనే విషయం తెలుసుకోవాలంటే ప్రతీ రెండు వారాలకు ఒక టెస్టు నిర్వహించాలి. అంటే ఏడాదికి 26 సార్లు టెస్టులు చేయాలి. ఇన్ని కోట్ల మంది నెగెటివ్ గానే ఉన్నారని తెలుసుకోవాలంటే ఎన్నికోట్ల టెస్టులు చేయాలో ఊహించుకోండి. కాబట్టి టెస్టుల ద్వారా దేశం మొత్తం నెగెటివ్ అయిపోయిందని ప్రకటించడం చాలా కష్టం, రోజుకు 1 మిలియన్ టెస్టులు చేయడం అనేది కూడా వాస్తవం కాదు. సిరో సర్వేల ద్వారా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతున్నదో తేలిన విషయం వాస్తవమే. జనసాంద్రత అధికంగా ఉండే నగరాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నది.
First Published:  8 Sep 2020 11:06 PM GMT
Next Story