కరోనా... మరో మూడు కొత్త లక్షణాలు !
ఒకవైపు కోవిడ్ 19కి చికిత్స చేస్తూనే వైద్యులు మరోవైపు దాని గురించిన కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్నారు. తాము తెలుసుకున్న నూతన అంశాలను బయటపెడుతున్నారు. కరోనా సోకినవారిలో మూడు కొత్త లక్షణాలు కనబడుతున్నాయని వైద్యులు అంటున్నారు. మామూలుగా అయితే జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఆయాసం, ముక్కు కారటం వంటివి ఉంటాయి కదా… అయితే తనవద్దకు వచ్చిన ఓ మహిళా కోవిడ్ పేషంటుకి ఆరువారాలుగా కాలివేళ్లు వాచిపోయి కనబడుతున్నాయని, ఆమెకు ఇతర లక్షణాలేమీ లేవని […]
ఒకవైపు కోవిడ్ 19కి చికిత్స చేస్తూనే వైద్యులు మరోవైపు దాని గురించిన కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్నారు. తాము తెలుసుకున్న నూతన అంశాలను బయటపెడుతున్నారు.
కరోనా సోకినవారిలో మూడు కొత్త లక్షణాలు కనబడుతున్నాయని వైద్యులు అంటున్నారు. మామూలుగా అయితే జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఆయాసం, ముక్కు కారటం వంటివి ఉంటాయి కదా… అయితే తనవద్దకు వచ్చిన ఓ మహిళా కోవిడ్ పేషంటుకి ఆరువారాలుగా కాలివేళ్లు వాచిపోయి కనబడుతున్నాయని, ఆమెకు ఇతర లక్షణాలేమీ లేవని డెన్నిస్ అనే వైద్యుడు ట్విట్టర్లో పేర్కొన్నాడు. కాలివేళ్లు ఎర్రగా కందిపోయి వాచి ఉన్న ఫొటోని…కోవిడ్ వేళ్లు అంటూ… ఆ వైద్యుడు పోస్ట్ చేశాడు.
ఈ లక్షణాల వలన చర్మం నొప్పికి, దురదకు కూడా గురవుతుంది. ఎక్కువమంది జనంతో కలిసిమెలసి పనిచేయాల్సిన ఉద్యోగంలో ఆ మహిళ ఉన్నట్టుగా ఆ వైద్యుడు వెల్లడించాడు. ఇలాంటివారిని చాలామందిని తాను చూసినట్టుగా కూడా తెలిపాడు. ముఖ్యంగా వైరస్ సోకిన పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయట. ఇటలీలో కరోనా వైరస్ బారినపడినవారిలో 20శాతం మందికి చర్మసమస్యలు వచ్చినట్టుగా ఇండియా టైమ్స్ పేర్కొంది.
లక్షణాలేమీ కనిపించని కోవిడ్ బాధితుల్లో కనబడుతున్న మరొక అరుదైన లక్షణం జుట్టు ఊడిపోవటం. కరోనా వచ్చి తగ్గిపోయినట్టుగా కూడా తెలియనివారిలో కొంతమందికి జుట్టు విపరీతంగా ఊడిపోవటం వైద్యులు గుర్తించారు.
ఎక్స్ ప్రెస్ యుకె అందిస్తున్న నివేదిక ప్రకారం… కోవిడ్ బాధితుల్లో ఎక్కిళ్లు కూడా ఒక లక్షణంగా కనబడుతోంది. శరీరం ఆక్సిజన్ ని తీసుకోవటం కొన్ని సెకన్లపాటు ఆపేసినప్పుడు ఎక్కిళ్లు వస్తాయని అంటారు. అలాగే కోవిడ్ బాధితుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయినప్పుడు ఎక్కిళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
అంటే… చర్మ సమస్యలు, జుట్టుఊడటం, ఎక్కిళ్లు… వీటిని కూడా కరోనా లక్షణాల జాబితాలో చేర్చుకోవాలన్నమాట.