Telugu Global
Health & Life Style

నిద్రలేకపోతే...కోపం!

తగినంత నిద్రలేకపోతే అనేక అనారోగ్యాలు మనపై దాడి చేస్తాయని, శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటాయని…  చాలా సందర్భాల్లో వింటున్నాం.  నిద్రలేకపోతే కోపం పెరిగిపోతుందని ఒక అధ్యయనంలో తేలింది. స్లీప్ అనే పత్రికలో దాని తాలూకూ వివరాలు ప్రచురించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 147 మందిని ఎంపిక చేసుకుని రెండురోజులపాటు… వాళ్లు మామూలుగా ఎలా నిద్రపోతారో అవే వేళలు పాటించమని కొంతమందికి చెప్పారు. మరి కొంతమందికి […]

నిద్రలేకపోతే...కోపం!
X

తగినంత నిద్రలేకపోతే అనేక అనారోగ్యాలు మనపై దాడి చేస్తాయని, శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటాయని… చాలా సందర్భాల్లో వింటున్నాం. నిద్రలేకపోతే కోపం పెరిగిపోతుందని ఒక అధ్యయనంలో తేలింది. స్లీప్ అనే పత్రికలో దాని తాలూకూ వివరాలు ప్రచురించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అనే సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

147 మందిని ఎంపిక చేసుకుని రెండురోజులపాటు… వాళ్లు మామూలుగా ఎలా నిద్రపోతారో అవే వేళలు పాటించమని కొంతమందికి చెప్పారు. మరి కొంతమందికి తక్కువ గంటలు నిద్రపోవాల్సిందిగా సూచించారు. రెండు రోజుల అనంతరం… వారందరినీ ఒకచోట చేర్చి… తీవ్రమైన అసహనాన్ని, చిరాకుని కలిగించే శబ్దాలను వినిపించారు.

తగినంత స్థాయిలో నిద్రపోయినవారు ఆ శబ్దాలకు మరీ ఎక్కువగా విసుగు చెందలేదు. సాధారణంగా ఉండగలిగారు. కానీ తక్కువ నిద్రపోయినవారు మాత్రం చాలా తీవ్రమైన ఆగ్రహానికి, అసహనానికి గురయ్యారు.

తగినంత స్థాయిలో నిద్రలేనివారు… జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలను తట్టుకోలేరని… వారు చాలా త్వరగా కోపానికి గురవుతుంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. అనవసరంగా కోపం ప్రదర్శించి… కోపాన్ని పెంచే సందర్భాలకు వారే కారణమవుతుంటారని వారు చెబుతున్నారు.

కోపం వెనుక ఉన్న న్యూరోసైన్స్…

మన మెదడులో పైన ఉండే భాగాన్ని సెరిబ్రల్ కార్టెక్స్ అంటారు. ఇది మనం లాజిక్ తో ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగాలకు సంబంధించిన భాగాన్ని లింబిక్ సిస్టమ్ అంటారు. ఇది మెదడులో కింది భాగంలో ఉంటుంది. కోపం వచ్చిన వ్యక్తిలో సెరిబ్రల్ కార్టెక్స్ కంటే లింబిక్ సిస్టమ్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. అందుకే కోపంలో ఉన్నపుడు మనకు మంచి చెడులు, హేతుబద్దమైన ఆలోచనలు ఉండవు. భావోద్వేగాలను మాత్రమే ప్రదర్శిస్తుంటాం.

First Published:  2 Sep 2020 9:14 PM GMT
Next Story