Telugu Global
Health & Life Style

‘మెన్’ ని ముట్టుకోకండి... ‘ఉమెన్’ ని అనుసరించండి !

కోవిడ్ 19 కారణంగా మన జీవితాల్లో అనేక నియమ నిబంధనలు వచ్చేశాయి. అవి చేయండి… ఇవి చేయకండి… అంటూ అనుక్షణం ఎవరో ఒకరు సోషల్ మీడియాలో సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. కోవిడ్ 19 విషయంలో పాటించాల్సిన నియమాలను ఇప్పుడు రెండు పదాల రూపంలో సంక్షిప్తంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ‘మెన్’ (ఎమ్.ఇ.ఎన్) ని ముట్టుకోకండి….‘ఉమెన్’ (డబ్ల్యు.ఓ.ఎమ్.ఇ.ఎన్)ని అనుసరించండి అంటున్నారు వారు. ఇక్కడ మెన్ లోని ఆంగ్ల అక్షరాలు…. ఎమ్.ఇ.ఎన్ అంటే మౌత్, ఐస్, నోస్. మెన్ […]

‘మెన్’ ని ముట్టుకోకండి... ‘ఉమెన్’ ని అనుసరించండి !
X

కోవిడ్ 19 కారణంగా మన జీవితాల్లో అనేక నియమ నిబంధనలు వచ్చేశాయి. అవి చేయండి… ఇవి చేయకండి… అంటూ అనుక్షణం ఎవరో ఒకరు సోషల్ మీడియాలో సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. కోవిడ్ 19 విషయంలో పాటించాల్సిన నియమాలను ఇప్పుడు రెండు పదాల రూపంలో సంక్షిప్తంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

‘మెన్’ (ఎమ్.ఇ.ఎన్) ని ముట్టుకోకండి….‘ఉమెన్’ (డబ్ల్యు.ఓ.ఎమ్.ఇ.ఎన్)ని అనుసరించండి అంటున్నారు వారు. ఇక్కడ మెన్ లోని ఆంగ్ల అక్షరాలు…. ఎమ్.ఇ.ఎన్ అంటే మౌత్, ఐస్, నోస్. మెన్ ని ముట్టుకోకండి అంటే…. నోరు, కళ్లు, ముక్కు ముట్టుకోవద్దు అని.

ఇక ఉమెన్ లోని డబ్ల్యు.ఓ.ఎమ్.ఇ.ఎన్…. అక్షరాలకు అర్థం… డబ్ల్యు…వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ (సబ్బుతో చేతులు కడుక్కోండి), ఓ….ఒబే డైరక్టివ్స్ (ఆదేశాలను పాటించండి), ఎమ్…. మూవ్ ఎవే ఫ్రం క్రౌడెడ్ ప్లేసెస్ (జనంతో రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి) ఇ…. ఎక్సర్ సైజ్ రెగ్యులర్లీ (ప్రతిరోజు వ్యాయామం చేయండి) ఎన్… నెవర్ ఇగ్నోర్ వార్నింగ్ సిగ్నల్స్ ( మిమ్మల్ని హెచ్చరించే వ్యాధితాలూకూ సంకేతాలు కనబడితే వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు). ఉమెన్ లో ఉన్న అక్షరాలను విడమరచి చెబితే… అవి కోవిడ్ 19ని దూరంగా ఉంచే జాగ్రత్తలు. అందుకే ‘ఉమెన్’ ని అనుసరించి కోవిడ్ 19కి దూరంగా ఉండమన్నారు.

కోవిడ్ 19ని నివారించాలంటే ‘మగవారికి దూరంగా ఉండండి… మహిళలను అనుసరించండి’ అనే భావాలు ఈ సంక్షిప్త పదాల్లో ఉన్నాయి. దాంతో ఇవి సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకర్షించి మీమ్ గా మారాయి. మెన్, ఉమెన్ అనే పదాలను సంక్షిప్త పదాలుగా వినియోగించిన తీరుపై అనేక హాస్యపూరిత వ్యాఖ్యానాలు, ఛలోక్తులు వినబడుతున్నాయి.

First Published:  3 Sep 2020 7:11 AM GMT
Next Story