Telugu Global
National

అంబులెన్స్ కి మహిళా డ్రైవర్... దేశంలోనే తొలిసారి!

కొన్నిరకాల ఉద్యోగాల్లో మనకు మహిళలు కనిపించరు. ఆడవాళ్లు ఆ పనులు చేయలేరని సమాజంలో అందరూ నమ్ముతుండటం వల్లనే అలా జరుగుతుంటుంది. అలాంటి ఉద్యోగాల్లో అంబులెన్స్ డ్రైవర్ జాబ్ కూడా ఒకటి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఆ వివక్షని పక్కన పెట్టి… ఓ మహిళను అంబులెన్స్ డ్రైవర్ గా తీసుకుంది. ఎమ్ వీరలక్ష్మి అనే ముప్పయ్యేళ్ల మహిళ 108 అంబులెన్స్ కి డ్రైవర్ గా నియమితురాలైంది.  దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మేనని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. […]

అంబులెన్స్ కి మహిళా డ్రైవర్... దేశంలోనే తొలిసారి!
X

కొన్నిరకాల ఉద్యోగాల్లో మనకు మహిళలు కనిపించరు. ఆడవాళ్లు ఆ పనులు చేయలేరని సమాజంలో అందరూ నమ్ముతుండటం వల్లనే అలా జరుగుతుంటుంది. అలాంటి ఉద్యోగాల్లో అంబులెన్స్ డ్రైవర్ జాబ్ కూడా ఒకటి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఆ వివక్షని పక్కన పెట్టి… ఓ మహిళను అంబులెన్స్ డ్రైవర్ గా తీసుకుంది. ఎమ్ వీరలక్ష్మి అనే ముప్పయ్యేళ్ల మహిళ 108 అంబులెన్స్ కి డ్రైవర్ గా నియమితురాలైంది. దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మేనని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన వీరలక్ష్మి ఇంతకుముందు క్యాబ్ డ్రైవర్ గా పనిచేసింది.

‘అంబులెన్స్ డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసి అప్లయి చేశాను… ఇంటర్వ్యూలో విజయం సాధించగలనని అనుకున్నా గానీ… దేశంలో నేనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ నని నాకు తెలియదు…’ అని తెలిపిందామె. తను చేసే పని… తనకు సంపాదన ఇస్తే చాలదని తన తోటి మనుషులకు ఏదోఒక రకంగా సేవ చేసేదై ఉండాలని భావించానని, అందుకే ఈ ఉద్యోగంలోకి వచ్చానని వీరలక్ష్మి చెప్పింది.

రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింతగా పటిష్టం చేయాలనే ఉద్దేశ్యంతో ఒకేసారి 108 అంబులెన్స్ లను అందుబాటులోకి తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. ఈ వాహనాలకు నియమితులైన డ్రైవర్లలో వీరలక్ష్మి కూడా ఉంది.

First Published:  1 Sep 2020 8:28 AM GMT
Next Story