Telugu Global
Cinema & Entertainment

ప్లాస్మా దానం చేసిన కీరవాణి-కాలభైరవ

సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ ప్లాస్మా దానం చేశారు. కరోనాతో పోరాడుతున్న రోగులకు ఈ ప్లాస్మా ఎంతగానో ఉపయోగపడుతుందే విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా ప్లాస్మా డొనేషన్ పై స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. అందుకే కీరవాణి-భైరవ ఇలా ప్లాస్మా డొనేట్ చేశారు. కొన్ని రోజుల కిందట కీరవాణి-రాజమౌళి కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు ఆ వైరస్ నుంచి వాళ్లు త్వరగానే కోలుకున్నారు. […]

ప్లాస్మా దానం చేసిన కీరవాణి-కాలభైరవ
X

సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన తనయుడు కాలభైరవ ప్లాస్మా దానం చేశారు. కరోనాతో పోరాడుతున్న రోగులకు ఈ ప్లాస్మా ఎంతగానో ఉపయోగపడుతుందే విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ కూడా ప్లాస్మా డొనేషన్ పై స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. అందుకే కీరవాణి-భైరవ ఇలా ప్లాస్మా డొనేట్ చేశారు.

కొన్ని రోజుల కిందట కీరవాణి-రాజమౌళి కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు ఆ వైరస్ నుంచి వాళ్లు త్వరగానే కోలుకున్నారు. ఇప్పుడు వాళ్ల బాడీలో యాంటీబాడీస్ వృద్ధి చెందడంతో ప్లాస్మా డొనేట్ చేశారు.

కిమ్స్ హాస్పిటల్ లో కొడుకుతో కలిసి స్వచ్ఛందంగా ప్లాస్మా డొనేట్ చేసినట్టు ప్రకటించిన కీరవాణి.. సాధారణ రక్తదానం లాంటిదే ప్లాస్మా దానమని, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తున్నాడు.

త్వరలోనే దర్శకుడు రాజమౌళి కూడా ప్లాస్మా దానం చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ విషయాన్ని ప్రకటించిన జక్కన్న, తన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందిన తర్వాత ప్లాస్మా డొనేట్ చేయబోతున్నాడు.

First Published:  1 Sep 2020 2:00 AM GMT
Next Story