Telugu Global
International

అమెరికాలో భారతీయుల కాసుల పంట

అమెరికాలో భారతీయులు డాలర్ల పంట పండిస్తున్నారు. అమెరికాలోని మధ్యతరగతి కుటుంబాల ఆదాయంపై అక్కడ సర్వే నిర్వహించారు. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంటుంది. అమెరికాలో అత్యధిక ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాల్లో భారతీయులు తొలి స్థానంలో నిలిచారు. వివిధ దేశాల నుంచి వచ్చిన, స్థిరపడిన వారి ఆదాయం కంటే భారతీయుల ఆదాయం ఎక్కువగా ఉంది. సగటున భారతీయ మధ్య తరగతి కుటుంబాలు అమెరికాలో ఏడాదికి లక్షా 500 డాలర్లు సంపాదిస్తున్నారు. రెండో స్థానంలో ఫిలిప్పోలు […]

అమెరికాలో భారతీయుల కాసుల పంట
X

అమెరికాలో భారతీయులు డాలర్ల పంట పండిస్తున్నారు. అమెరికాలోని మధ్యతరగతి కుటుంబాల ఆదాయంపై అక్కడ సర్వే నిర్వహించారు. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్ కమ్యూనిటీ సర్వే నిర్వహిస్తుంటుంది. అమెరికాలో అత్యధిక ఆదాయం కలిగిన మధ్యతరగతి కుటుంబాల్లో భారతీయులు తొలి స్థానంలో నిలిచారు. వివిధ దేశాల నుంచి వచ్చిన, స్థిరపడిన వారి ఆదాయం కంటే భారతీయుల ఆదాయం ఎక్కువగా ఉంది.

సగటున భారతీయ మధ్య తరగతి కుటుంబాలు అమెరికాలో ఏడాదికి లక్షా 500 డాలర్లు సంపాదిస్తున్నారు. రెండో స్థానంలో ఫిలిప్పోలు 83వేల 300 డాలర్లు సంపాదిస్తున్నారు. మూడో స్థానంలో తైవాన్‌ వారు 82వేల500 డాలర్లు, శ్రీలంకవాళ్లు 74వేల 600 డాలర్లు సంపాదిస్తున్నారు.

అమెరికాలోని చైనా వారు 69వేల 100 డాలర్లు, పాకిస్థాన్‌ వాళ్లు 66వేల 200 డాలర్లు ఆదాయం పొందుతున్నారు. వైట్ అమెరికన్లు 9వ స్థానంలోఉన్నారు. వారి మధ్యతరగతి ఆదాయం 59వేల 900 డాలర్లుగా ఉంది. బంగ్లాదేశీయులు 50వేల డాలర్లు, నేపాలీలు 43వేల 500 డాలర్లు సగటుగా ఏడాదికి సంపాదిస్తున్నారు.

First Published:  30 Aug 2020 11:33 PM GMT
Next Story