Telugu Global
Cinema & Entertainment

నవలా రచయితగా నివేత థామస్

డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నివేత థామస్. ఆమెకు హీరోయిజంతో సంబంధం లేదు, క్యారెక్టర్ బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. ఇప్పుడీ నటి నవలా రచయితగా మారింది. అవును.. V అనే సినిమాలో నివేత థామస్ పాత్ర ఇదే. “దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఇందులో నా పాత్ర పేరు అపూర్వ. సినిమాలో నేనొక క్రైమ్ నవలా రచయితగా కనిపిస్తాను. అపూర్వ […]

నవలా రచయితగా నివేత థామస్
X

డిఫరెంట్ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నివేత థామస్. ఆమెకు హీరోయిజంతో సంబంధం లేదు, క్యారెక్టర్ బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. ఇప్పుడీ నటి నవలా రచయితగా మారింది. అవును.. V అనే సినిమాలో నివేత థామస్ పాత్ర ఇదే.

“దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఇందులో నా పాత్ర పేరు అపూర్వ. సినిమాలో నేనొక క్రైమ్ నవలా రచయితగా కనిపిస్తాను. అపూర్వ ఎంత వినయంగా ఉంటుందో అంతే డేరింగ్ గా ఆత్మవిశ్వాసంతో ఉంటుంది”

ఇలా “V” సినిమాలో తన పాత్ర ఏంటనే విషయాన్ని బయటపెట్టింది నివేత. సినిమాకు ప్రచారం కల్పించేందుకు ఆన్ లైన్ లో ప్రెస్ మీట్ పెట్టింది నివేత. కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా సినిమాలో తన పాత్రను బయటపెట్టింది.

అంతేకాదు.. సినిమాలో అంతా నానిది విలన్ పాత్ర అనుకుంటున్నారని, కానీ అంతకుమించి సర్ ప్రైజ్ సినిమాలో ఉందని ఊరిస్తోంది. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో డైరక్ట్ గా విడుదల కాబోతోంది V మూవీ.

First Published:  30 Aug 2020 7:00 AM GMT
Next Story