Telugu Global
International

కరోనా నయం అయ్యాక... మళ్లీ వస్తుందా?

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై ఇంకా ప్రజలకు ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే దేశంలో 35 లక్షల మందికి కరోనా సోకగా… వాళ్లలో 70 శాతం మంది కోలుకున్నారు. కోలుకున్న బాధితులు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నా.. కొన్ని అనుమానాలు మాత్రం ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని చోట్ల వైరస్ వచ్చి తగ్గిపోయిన వారికి… కొన్ని వారాల్లోనే తిరిగి పాజిటివ్ వచ్చింది. అంటే రోగం తగ్గిపోయి, యాంటీ బాడీలు […]

కరోనా నయం అయ్యాక... మళ్లీ వస్తుందా?
X

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై ఇంకా ప్రజలకు ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే దేశంలో 35 లక్షల మందికి కరోనా సోకగా… వాళ్లలో 70 శాతం మంది కోలుకున్నారు. కోలుకున్న బాధితులు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్నా.. కొన్ని అనుమానాలు మాత్రం ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి.

ప్రపంచంలో కొన్ని చోట్ల వైరస్ వచ్చి తగ్గిపోయిన వారికి… కొన్ని వారాల్లోనే తిరిగి పాజిటివ్ వచ్చింది. అంటే రోగం తగ్గిపోయి, యాంటీ బాడీలు పెరిగిన తర్వాత కూడా ఎందుకు కరోనా బారిన పడుతున్నారనే అనుమానాలు నెలకొన్నాయి.

ఒక సారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా మళ్లీ వ్యాధి బారిన పడుతున్నామనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. రెండో సారి సోకితే తమకు మరింత ప్రమాదకరంగా మారుతుందేమోనని అనుకుంటున్నారు. అసలు రెండో సారి ఎందుకు వ్యాధి వస్తుందనే దానిపై శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు.

కరోనా బారిన పడి కోలుకున్న వారి శరీరంలో కొన్ని మృత వైరస్‌లు అలాగే ఉంటున్నాయి. వారి రక్తాన్ని పరీక్షించినప్పుడు పాజిటివ్ అని ఫలితం వస్తున్నది. అయితే రెండో సారి రోగం వచ్చిన వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవని, అంతే కాకుండా వారి నుంచి ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం కూడా లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో న్యూట్రలైజింగ్ యాంటీ బాడీస్ వేగంగా విడుదల అవుతాయని.. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత యాంటీ బాడీస్ కూడా తగ్గుముఖం పడతాయని వారు అంటున్నారు.

కాగా, శరీరంనుంచి వైరస్‌లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ‘రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్’ టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్‌ వస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం మృత వైరస్‌ల వల్ల వచ్చిన ఫలితమే అని వారు నిర్థారించారు. రెండో సారి కరోనా సోకిన కేసులు ఇప్పుడిప్పుడే ఇండియాలో పెరుగుతున్నాయి. మొదటి సారి లక్షణాలు కనిపించినా, రెండో సారి మాత్రం ఎలాంటి లక్షణాలు ఉండట్లేదు. వారికి ప్రాణాపాయం కూడా ఉండదు అని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్ స్పష్టం చేశారు.

First Published:  30 Aug 2020 2:26 AM GMT
Next Story